English   

సిట్టిబాబు గట్టిగా కొట్టాడండీ.. ఆయ్.. 

Rangasthalam-charan
2018-05-23 15:20:21

హిట్టంటే ఇదీ.. సాలిడ్ హిట్.. సిట్టిబాబుకు వినిపించకపోతేనేం.. ఆడు రికార్డ్ కొడితే అదలాగే భద్రంగా ఉంటుందని ప్రూవ్ చేసుకున్నాడు. హిట్ అంటే ఇది మామూలు హిట్ కాదు.. సాలిడ్ హిట్. మరో మాటకు తావు లేని హిట్. ఇన్నిసార్లు హిట్ అంటున్నామంటేనే అర్థం చేసుకోవచ్చు.. సిట్టిబాబు ఇంజిన్ పవరెంతో.. రీసెంట్ గా 80కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది రంగస్థలం. ఈ యాభై రోజులకు మొత్తం లెక్కలు తీస్తే.. వాల్డ్ వైడ్ గా ఏకంగా 126కోట్ల షేర్ వచ్చింది. బాహుబలి తర్వాత ఇదే హయ్యొస్ట్. తర్వాత వచ్చిన ఎవరూ సిట్టిబాబు దగ్గర్లోకి కూడా రాలేకపోయారనేది నిజం.. మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 94కోట్లు షేర్ వసూలు చేశాడీ మెగా పవర్ స్టార్. ఓవర్శీస్ లో కూడా విపరీతమైన లాభాల్లోకి వెళ్లిపోయారు డిస్ట్రిబ్యూటర్స్. ఇక్కడా సేమ్.. బాహుబలి  తర్వాత తెలుగులో ఒక సినిమాను కొన్న వాళ్లంతా పూర్తి స్థాయిలో లాభాలు పొందింది రంగస్థలంతోనే అనేది సత్యం. 

మొత్తగా తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం కలెక్షన్స్ ఇవే. 

నైజాం     - రూ. 28.55 కోట్లు
సీడెడ్     - రూ. 18.57 కోట్లు
ఉత్తరాంధ్ర     - రూ. 13.52 కోట్లు
ఈస్ట్     - రూ. 8.04 కోట్లు
వెస్ట్     - రూ. 7.74 కోట్లు
గుంటూరు     - రూ. 8.60 కోట్లు
కృష్ణా     - రూ. 7 కోట్లు
నెల్లూరు     - రూ. 3.49 కోట్లు

సో నైజాంలో మరోసారి మెగా ఫ్యామిలీ పవర్ ఏంటో మరోసారి ప్రూవ్ అయిందన్నమాట. 

More Related Stories