English   

రంగ‌స్థ‌లం ఫైన‌ల్.. 48 కోట్ల లాభం..!

Rangasthalam
2018-05-24 09:48:43

ఈ రోజుల్లో సినిమాలు మూడు రోజులు దాటితే చాలనుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రీ బాగుంటే వారం రోజులు.. ఇంకా బాగుంటే మ‌రో వారం అంతే.. అక్క‌డితో దుకాణం బంద్. చాలా కొద్ది సినిమాలు మాత్ర‌మే మూడు వారాలు దాటినా కూడా థియేట‌ర్స్ లో ఉంటాయి.. క‌లెక్ష‌న్లు తీసుకొస్తూ ఉంటాయి. గ‌తేడాది బాహుబ‌లి 2, ఫిదా ఇలాగే మాయ చేసాయి. ఇక ఈ ఏడాది రంగ‌స్థ‌లం చేసింది ఈ మాయ‌. ఐదు వారాలు వ‌సూళ్లు తెచ్చిన ఈ చిత్రం.. ఆరు, ఏడు వారాంతాల్లోనూ చెప్పుకోద‌గ్గ షేర్స్ తీసుకొచ్చింది. ఈ మ‌ధ్యే ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఫుల్ ర‌న్ లో 126 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అమ్మింది మాత్రం 78 కోట్ల‌కే. 

అంటే 48 కోట్ల లాభాలు తీసుకొచ్చాడు సిట్టిబాబు. తెలుగు రాష్ట్రాల్లో 93 కోట్లు దాటేసింది ఈ చిత్ర వ‌సూళ్లు. బాహుబ‌లి కాకుండా మ‌రే సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ అందుకోలేదు. మార్చ్ 30న విడుద‌లైన ఈ చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగా, కృష్ణార్జున యుద్ధం, భ‌ర‌త్ అనే నేను లాంటి సినిమాల‌ను దాటేస్తూ ఇంత స‌త్తా చూపించింది. ఒక్క యుఎస్ లోనే 3.5 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూలు చేసింది. మిగిలిన దేశాల్లో క‌లిపి మొత్తం 4.8 మిలియ‌న్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. దానికితోడు నైజాంలో నాన్ బాహుబలి కేట‌గిరీలో 28 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమాగా చ‌రిత్ర తిర‌గ రాసింది. మొన్నే అమేజాన్ లో విడుద‌లైన ఈ చిత్రం ఇప్పుడు అక్క‌డా అద్భుతాలు చేస్తుంది. మొత్తానికి షిఫ్టింగ్ థియేట‌ర్స్ బేస్ మీద దాదాపు 100 స్క్రీన్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది రంగ‌స్థ‌లం. ఈ రోజుల్లో ఇది చాలా గొప్ప విష‌య‌మే. 

More Related Stories