English   

తొలిరోజు 29 కోట్ల రంగ‌స్థ‌లం.. 

Rangasthalam-Collections
2018-03-31 15:27:53

రామ్ చ‌ర‌ణ్ ర‌చ్చ మొద‌లైంది. చాలా ఏళ్ళ త‌ర్వాత ఈయ‌న రేంజ్ ఏంటో బాక్సాఫీస్ చూస్తుంది. తెలుగు ఇండ‌స్ట్రీ మార్కెట్ రేంజ్ పెరిగిన త‌ర్వాత త‌న స‌త్తా చూపించుకునే అవ‌కాశం మెగా వార‌సుడికి రాలేదు. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స‌గా అన్ని సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. ధృవ బాగానే ఆడినా అది రికార్డులు సృష్టించే సినిమా కాదు. జ‌స్ట్ బ‌య‌ప‌డిందంతే. ఇలాంటి టైమ్ లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం ఈయ‌న రేంజ్ ఏంటో చూపిస్తుంది. అస‌లు రామ్ చ‌ర‌ణ్ రెచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపిస్తుంది. తొలిరోజే 29 కోట్ల షేర్ వ‌సూలు చేసింది రంగ‌స్థ‌లం. తెలుగులో ఆల్ టైమ్ టాప్ ఓపెనింగ్ డే రికార్డుల్లో ఆరో స్థానంలో ఉన్నాడు మెగా వార‌సుడు. తెలుగు రాష్ట్రాల్లో 19.50 కోట్లు.. ఓవ‌ర్సీస్ లో 4.92 కోట్లు.. క‌ర్ణాట‌క‌లో 2.15 కోట్లు.. మిగిలిన చోట్ల మ‌రో రెండు కోట్లు వ‌సూలు చేసి మొత్తంగా తొలిరోజే 29 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. రెండో రోజు కూడా భారీ వ‌సూళ్లు రావ‌డం ఖాయ‌మైపోయింది. ఇప్ప‌టికే సినిమాకు సూప‌ర్ పాజిటివ్ టాక్ ఉండ‌టం.. ప‌క్కా ప‌ల్లెటూరి సినిమా కావ‌డంతో రంగ‌స్థ‌లంపై అంచ‌నాలు నిల‌బ‌డ్డాయి. అదే ఇప్పుడు క‌లెక్ష‌న్ల‌లో క‌నిపిస్తుంది. ఓవ‌ర్సీస్ లో అయితే ఈ చిత్ర ర‌చ్చ మామూలుగా లేదు. తొలిరోజే అక్క‌డ 1.2 మిలియ‌న్ మార్క్ అందుకుంది. ఈ చిత్ర తీరు జోరు చూస్తుంటే మూడు రోజుల్లోనే 2 మిలియ‌న్ మార్క్ అందుకోవ‌డం ఖాయ‌మైపోయింది. మొత్తానికి ఇంటా బ‌య‌టా ఒకేసారి బాగా గ‌ట్టిగా కొట్టేసాడు రామ్ చ‌ర‌ణ్.
 

More Related Stories