English   

రంగ‌స్థ‌లం 112 కోట్లు నాటౌట్..!

ram-charan

50 కోట్ల మార్కెట్ ఉన్న హీరో 110 కోట్ల కంటే ఎక్కువ వ‌సూలు చేయ‌డ‌మే కాకుండా నాలుగు వారాల త‌ర్వాత కూడా బాక్సాఫీస్ ను రూల్ చేస్తుంటే ఏం అనాలి..? అంత‌కంటే ఆ హీరోకు అదృష్టం మ‌రోటి ఉంటుందా..? ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది. రంగ‌స్థ‌లంతో సిట్టి బాబు సెట్ చేస్తోన్న రికార్డులు చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ సినిమా విజ‌యం సాధిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు కానీ మ‌రీ ఈ రేంజ్లో రికార్డుల‌ను మ‌డ‌త పెడుతుంద‌ని మాత్రం ఎవరూ ఊహించ‌లేదు. తెలుగు రాష్ట్రాల్లో 83 కోట్లు దాటేసింది ఈ చిత్ర వ‌సూళ్లు. బాహుబ‌లి కాకుండా మ‌రే సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ అందుకోలేదు. మార్చ్ 30న విడుద‌లైన ఈ చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగా, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాల‌ను పూర్తిగా తొక్కేసింది. వీటిని దాటుకుని మ‌రీ స‌త్తా చూపించింది. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను వ‌చ్చినా కూడా నాలుగో వారంలోనూ ఉన్న ఆ కాస్త థియేట‌ర్స్ లోనే క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి హైద‌రాబాద్ లో నాలుగో వారం ముగిసిన త‌ర్వాత కూడా మ‌రో 18 స్క్రీన్లు పెంచారు. ఇక్క‌డ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన యువీ క్రియేష‌న్స్ రంగ‌స్థ‌లం దూకుడు చూసి స్క్రీన్స్ తెచ్చుకున్నారు. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం ఖాతాలో 112 కోట్ల షేర్ వ‌చ్చింది. ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా 3.5 మిలియ‌న్ డాల‌ర్స్ వైపు ప‌రుగులు తీస్తుంది ఈ చిత్రం. దానికితోడు నైజాంలో నాన్ బాహుబలి కేట‌గిరీలో 25 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమాగా చ‌రిత్ర సృష్టించింది రంగ‌స్థ‌లం. ఇంకా ఫుల్ ర‌న్ పూర్తి కాలేదు. అది కూడా అయ్యేలోపు ఈ చిత్రం ఈజీగా మ‌రో 4 కోట్ల షేర్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 

More Related Stories