English   

రంగ‌స్థ‌లం.. ఇండ‌స్ట్రీకి కూడా అవ‌స‌రం..

Rangasthalam-Hit
2018-03-28 16:39:00

రంగ‌స్థ‌లం విజ‌యం ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కు మాత్ర‌మే కాదు.. ఇండ‌స్ట్రీకి కూడా చాలా అవ‌స‌రం. ఒక్క‌సారి 2018ని రివైండ్ చేసుకోండి. ఈ ఏడాది మొద‌లై మూడు నెల‌లు దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా వ‌చ్చిందా..? చ‌లో లాంటి చిన్న సినిమాను వ‌దిలేయండి. ఎందుకంటే ఆ సినిమాకు ఎన్ని వ‌సూళ్లు వ‌చ్చినా 12 కోట్లు దాట‌లేదు. మనం మాట్లాడుకుంటున్న‌ది పెద్ద సినిమాల గురించి. రికార్డులు సృష్టించాలి అని కోరుకున్న అజ్ఞాత‌వాసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ చిత్రం చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన జై సింహా.. భాగ మ‌తి.. తొలిప్రేమ లాంటి సినిమాలు హిట్ అయ్యాయి కానీ బ్లాక్ బ‌స్ట‌ర్లు కాదు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఏడాది మొద‌లై 100 రోజులు గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కు బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ రాలేదు. ఆ కోరిక‌ను ఇప్పుడు రంగ‌స్థ‌లం తీరుస్తుందేమో అని వేచి చూస్తున్నారంతా. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 80 కోట్ల‌కు చేరిపోయింది. అంటే హిట్ కొట్టాల‌న్నా కూడా ఇండ‌స్ట్రీ రికార్డులు చాలానే దాటాలి. ఇప్పుడు సుకుమార్ రేంజ్ చూస్తుంటే 80 కోట్లు క‌ష్ట‌మే.. ఇక చ‌ర‌ణ్ రేంజ్ కూడా 60 కోట్ల‌లోపే ఉంది. కానీ స‌రైన సినిమా ప‌డితే రికార్డులు తిర‌గ‌రాస్తాడ‌ని ప‌దేళ్ల కిందే నిరూపించాడు చ‌ర‌ణ్. ఆ న‌మ్మ‌కమే ఇప్పుడు రంగ‌స్థ‌లంపై క‌నిపిస్తుంది. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో.?? 
 

More Related Stories