English   

రంగస్థలం హిట్ కు ఇవే కారణమా..?

Rangasthalam-Hit
2018-03-31 09:15:24

రంగస్థలం బ్లాక్ బస్టర్.. ఈ మాట మేం అనడం లేదు. ప్రేక్షకులు సర్టిఫై చేశారు. సినిమా వాళ్లు ఆల్రెడీ రేపటి పోస్టర్స్ రెడీ చేసుకున్నారు. అఫ్ కోర్స్ సినిమా నిజంగానే బ్లాక్ బస్టర్ కొట్టేసిందనుకోండి. అయితే సినిమా కైనా హిట్ టాక్ వస్తే అందులో ఆ టాక్ రావడానికి కారణమయ్యే అంశాల్లో ఫస్ట్ హీరోలే ఉంటారు. ఇందులోనూ అంతే. కానీ ఇతను హీరో కాని హీరో. అంటే హీరోనే కానీ చిట్టిబాబు. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు. రామ్ చరణ్ నటనే రంగస్థలాన్ని నెక్ట్స్ లెవల్లో నిలిపింది. అందులో సందేహం లేదు. అతని అద్భుతమైన నటనకు తోడు ఆ పాత్ర చిత్రణ, ఆ పాత్రకు ఉండే డిజేబిలిటీ.. దాన్ని వాడుకుని కథను నడిపించిన విధానం బాగా వర్కవుట్ అయ్యాయి. తర్వాత సమంత. రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది శామ్. ఈ పాత్రను కూడా అత్యంత సహజంగా చిత్రీకరించాడు సుకుమార్. తర్వాత కుమార్ బాబుగా నటించిన ఆది పినిశెట్టి. ఆ కాలపు ఆవేశం లేని ఆలోచనాత్మక కుర్రాడిలా అద్భుతంగా నటించాడు. అతని క్యారెక్టరైజేషన్ అంతా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. కుమార్ బాబు అనే క్యారెక్టర్ ను బాగా అర్థం చేసుకుని కుమార్ బాబుగా ప్రవర్తించాడు ఆది. 

ఇక జగపతి బాబు.. భూపతి పాత్రలో కళ్లతోనే నటించేశాడు. అతని పేరు కూడా చాలామందికి తెలియదు. కేవలం ప్రెసిడెంట్ గానే పిలిచే ఈ పాత్ర ప్రవర్తన మాటల్లేకుండానే భయపెట్టేసిందంటే అతిశయోక్తి కాదు. కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్ ఎప్పట్లానే తనదైన శైలిలో మెప్పించాడు. అయితే క్లైమాక్స్ లో ఈ పాత్ర ఇచ్చే ట్విస్ట్ అద్దిరిపోయింది. ఊహించని ఈ ట్విస్ట్ కు ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారు. ఫైనల్ గా రంగమ్మత్తగా నటించిన అనసూయ. ఇన్నాళ్లూ తనకు ఎలాంటి ఇమేజ్ ఉందో అదే ఇమేజ్ ను వాడుకుంటూనే ఆ పాత్రకు అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు సుకుమార్. అనసూయకు ఇది లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. ఇకపై రంగమ్మత్త అనే పదానికే తను బ్రాండ్ అంబాసిడర్ అవుతుందనుకోవచ్చు. భర్త దుబాయ్ లో ఉన్నాడని ఊరి జనాల్ని నమ్మించిన ఆఖరుకు అతను చనిపోయాడని చెప్పే సీన్ లో అనసూయన నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ ఆరు పాత్రలే కీలకంగా ఉన్న రంగస్థలంలో ఇతర నటులు కూడా అత్యంత సహజంగా నటించడం విశేషం. రంగస్థలం కథకు ఆర్టిస్టుల సహజ నటని పెట్టని కోటలా మారి సినిమాను బ్లాక్ బస్టర్ చేసింది అనుకోవచ్చు.

More Related Stories