English   

ప‌దేళ్ల త‌ర్వాత ఆ క్ల‌బ్ లో చ‌ర‌ణ్.. 

Rangasthalam-Collections

తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ ను బాహుబ‌లి మ‌రో స్థాయిలో కూర్చోబెట్టింది. నిజానికి ఆ సినిమా వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా ఏదీ బాహు బ‌లి రేంజ్ ను అందుకోలేదు. క‌నీసం ఆ సినిమా సెట్ చేసిన మార్కెట్ ను కూడా యూజ్ చేసుకోలేదు. ఖైదీ నెం.150 వ‌చ్చినా కూడా అది చిరంజీవి మేనియాతో న‌డిచేసింది. కానీ అందులో స్ట్రాంగ్ కంటెంట్ లేదు. అయితే బాహుబ‌లి వ‌చ్చిన ఏడాది త‌ర్వాత ఇప్పుడు రంగ‌స్థ‌లం వ‌చ్చింది. మ‌న‌సు హ‌త్తుకునే ఎమోష‌న్స్ తో.. క‌ట్టిపడేసే స్క్రీన్ ప్లేతో.. రామ్ చ‌ర‌ణ్ అద్భుత‌మైన న‌ట‌న‌తో వ‌చ్చిన ఈ చిత్రం రిపీటెడ్ ఆడియ‌న్స్ ను తీసుకొస్తుంది థియేట‌ర్స్ కు. ఈ చిత్రం సృష్టిస్తోన్న సంచ‌ల‌నాలు చూసి అంతా షాక్ అయిపోతున్నారు. ఇక ఇప్పుడు రంగ‌స్థ‌లం ఖాతాలో మ‌రో రికార్డు కూడా చేరి పోయింది. అదే 150 కోట్ల క‌ల‌. ఆ క‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు బాహుబ‌లి కాకుండా అందుకున్న‌ది చిరంజీవి.. చ‌ర‌ణ్ మాత్ర‌మే. 9 ఏళ్ల కింద మ‌గ‌ధీర 150 కోట్ల గ్రాస్ అందుకుంది. 

అప్పుడు తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల స‌పోర్ట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు రంగ‌స్థ‌లం సోలోగా.. ఎలాంటి భాషా బేధం లేకుండా కుమ్మేసింది. తెలుగులో మాత్ర‌మే విడుద‌లై 150 కోట్ల మార్క్ అందుకున్న మూడో సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. బాహుబ‌లి కాకుండా.. ఖైదీ నెం.150 మాత్రమే ఈ రికార్డ్ అందుకుంది. ఈ చిత్రం 164 కోట్ల గ్రాస్.. 102 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇప్పుడు రంగ‌స్థ‌లం ఖాతాలో 95 కోట్ల షేర్.. 150 కోట్ల గ్రాస్ ఉంది. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే మ‌రో 5 కోట్ల షేర్ సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాద‌ని అర్థ‌మైపోతుంది. ఇదే జ‌రిగితే రంగ‌స్థ‌లం నెక్ట్స్ టార్గెట్ ఖైదీ నెం.150నే. ఈ చిత్రం పేరు మీదున్న 102 కోట్ల షేర్ రికార్డుల‌ను దాటేసి.. నాన్ బాహుబ‌లి రికార్డులు సెట్ చేయాల‌ని చూస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. మొత్తానికి తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి తండ్రి కొడుకులు ఇద్ద‌రు మాత్ర‌మే టాప్ పొజిష‌న్ లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రి ఈ రికార్డుల‌కు చెక్ పెట్టే హీరోలెవ‌రో..?

More Related Stories