English   

రంగస్థలం.. ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా.. ?

Rangasthalam-songs
2018-03-15 12:40:46

ఆ గట్టునుంటావా నాగన్నా.. ఈ గట్టుకొస్తావా నాగన్నా.. అంటూ రంగస్థంలో మరో ఊరమాస్ సాంగ్ ఊపేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తుందని వినగానే అర్థమైపోతోన్న ఈ పాటను తెలంగాణ జానపద కళాకారుడు శివనాగులు పాడటం విశేషం. ఇప్పటి వరకూ వచ్చిన మూడు పాటలకు భిన్నంగా నాటికాలపు ఎన్నికల ప్రచారానికి దగ్గరగా ఉన్న ఈ నెంబర్ అదిరిపోయిందంతే. ఇక జిగేలు రాణి అంటూ సాగే మరో ఐటమ్ సాంగ్.. ఇది కూడా హుషారుగా సాగుతోంది. సుబ్బిశెట్టి వంటి పదాలు ఆ కాలంనాటి సిసలైన హాస్యాన్ని, మోటు సరసాలను చూపించేలా ఉందీ పాట కూడా. ఈ పాటకు ముందు, మధ్యలో వచ్చే డైలాగ్స్ సుకుమార్ చెప్పడం మరో విశేషం.. ఇక పాటను ఘంటా వెంకట లక్ష్మి అనే గాయనితో పాడించటం ఆశ్చర్యం.

ఇవాళ విడుదల చేసిన రంగస్థలం ఆడియో సాంగ్స్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఆల్ సాంగ్స్ హైలెట్ అనే ముద్రవేసుకున్నాయి. ఆల్రెడీ వచ్చిన మూడు పాటలు ఇప్పటికే బిగ్గెస్ట్ హిట్ అయ్యాయి. ఇక ఈరెండు పాటలు కూడా సూపర్ హిట్ అనిపించుకుంటున్నాయి. కాకపోతే వచ్చిన మూడు పాటలతో పోలిస్తే వీటిలో సాహితీ విలువలు కాస్త తక్కువగానే ఉన్నాయి. అయితే ఇవన్నీ సందర్భానుసారంగా వచ్చే పాటల్లా కనిపిస్తున్నాయి కాబట్టి అదేవీ పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. ఇక చాలా రోజుల తర్వాత చంద్రబోస్ ఈ సినిమాతో సింగిల్ కార్డ్ టైటిల్ వేసుకున్నాడు. అన్ని పాటలూ అతనే రాశాడు.

రంగస్థలం విషయంలో దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ కాబోతోందని అర్థమైపోయింది.ఇక ఆ కాలాన్ని ప్రతిబింబించేలా నేపథ్య సంగీతం కూడా ఇంతే పర్ఫెక్ట్ గా అందిస్తాడని ఊహించుకోవచ్చు. మొత్తంగా ముందు వచ్చిన మూడు పాటలే కాదు.. జ్యూక్ బాక్స్ లో ఉన్న రెండు పాటలు కూడా అదిరిపోయాయి. అలా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ విననంతగా ఓ ఆడియోలో అన్ని ఐటమ్స్ సూపర్బ్ అనే పేరు తెచ్చుకుంది రంగస్థలం.

More Related Stories