English   

రంగ‌స్థ‌లం.. ఐదోవారంలోనూ అరాచ‌క‌మే..!

Rangasthalam-collections
2018-04-30 14:13:09

ఈ రోజుల్లో సినిమాలు మూడు రోజులు దాటితే చాలనుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఒక్క వారం హౌజ్ ఫుల్స్ ఆడితే త‌మ డ‌బ్బులు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. అంత‌కుమించి ఆడ‌టం కూడా లేదు ఈ మ‌ధ్య వ‌చ్చే సినిమాలు. ఎందుకంటే కంటెంట్ లేక మూడు రోజుల‌కే వాటి ప్ర‌యాణం ఆగిపోతుంది. ఇలాంటి టైమ్ లో ఐదు వారాలు అయినా కూడా ఇప్ప‌టికీ దుమ్ము దులిపేస్తుంది రంగ‌స్థ‌లం. ఈ సినిమా ఇప్ప‌టికీ వ‌సూళ్ల సునామీ సృష్టించడం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను కూడా ఆశ్చ‌ర్యంలో ప‌డేస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం 119 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అమ్మింది మాత్రం 78 కోట్ల‌కే. అంటే ఇప్ప‌టికే 41 కోట్ల లాభాలు తీసుకొచ్చాడు సిట్టిబాబు. తెలుగు రాష్ట్రాల్లో 87 కోట్లు దాటేసింది ఈ చిత్ర వ‌సూళ్లు. బాహుబ‌లి కాకుండా మ‌రే సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ అందుకోలేదు. మార్చ్ 30న విడుద‌లైన ఈ చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగా, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాల‌ను పూర్తిగా తొక్కేసింది. వీటిని దాటుకుని మ‌రీ స‌త్తా చూపించింది. 

ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను వ‌చ్చినా కూడా ఐదో వారంలోనూ ఉన్నా ఆ కాస్త థియేట‌ర్స్ లోనే క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి హైద‌రాబాద్ లో ఐదో వారం ముగిసిన త‌ర్వాత కూడా మ‌రో 18 స్క్రీన్లు పెంచారు. ఇక్క‌డ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన యువీ క్రియేష‌న్స్ రంగ‌స్థ‌లం దూకుడు చూసి స్క్రీన్స్ తెచ్చుకున్నారు. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం ఖాతాలో 119 కోట్ల షేర్ వ‌చ్చింది. ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా 3.5 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూలు చేసింది. దానికితోడు నైజాంలో నాన్ బాహుబలి కేట‌గిరీలో 25 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమాగా చ‌రిత్ర సృష్టించింది రంగ‌స్థ‌లం. ఇంకా ఫుల్ ర‌న్ పూర్తి కాలేదు. అది కూడా అయ్యేలోపు ఈ చిత్రం ఈజీగా మ‌రో 4 కోట్ల షేర్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 

More Related Stories