English   

చ‌ర‌ణ్ పై స‌మంత ఎన్ని కంప్లైంట్స్ చేసింది..

Rangasthalam

నిజ‌మే చ‌ర‌ణ్ పై స‌మంత ఎన్ని కంప్లైంట్స్ చేసింది. అంత అంద‌మైన అమ్మాయిని ప‌ట్టించుకోక‌పోవ‌డం అంటే అంత‌కు మించిన త‌ప్పు ఇంకేముంటుందీ.. చ‌ర‌ణ్ నువ్వు త‌ప్పు చేశావ్ కాబ‌ట్టే స‌మంత రంగ‌మ్మ మంగ‌మ్మ‌ల వ‌ద్ద తెగ బాధ‌ప‌డిపోతోంది.. నిజ‌మే రంగ‌స్థ‌లంలో మూడో లిరిక‌ల్ సాంగ్ విన్న త‌ర్వాత ఇలాంటి ఫీలింగ్ రావ‌డంలో ఏ త‌ప్పూ లేదు. మ‌రి ఇంత సోయ‌గాన్ని చూసి పక్క‌నే ఉండి కూడా ప‌ట్టించుకోక‌పోతే ఏ పిల్ల మాత్రం ఊరుకుంటుంది. అందుకే స‌మంత ఇన్ని కంప్లైంట్స్ చేస్తోంది. సో.. రంగ‌స్థ‌లం నుంచి వ‌చ్చో మూడో పాట కూడా మెస్మ‌రైజ్ చేసింది. కాక‌పోతే గ‌త రెండు పాట‌ల‌తో పోలిస్తే కాస్త హుషారు త‌గ్గినా.. రిపీట్ మోడ్ లో వినేంత సొగ‌సు ఈ పాట‌లో ఉంది. పైగా లిరిసిస్ట్ చంద్ర‌బోస్ ఫ‌స్ట్ సాంగ్ లాగే ఈ రొమాంటిక్ సాంగ్ కు కాస్త ఫోక్ ట‌చ్ ఇచ్చాడు. అదికాస్తా సింగ‌ర్ గొంతులో న‌య‌గారాలు పోతూ న‌యా ఫీలింగ్ ఇస్తోంది.

ఇప్ప‌టికే రెండు పాట‌ల‌తో వాహ్ అనిపించిన ర‌చయిత చంద్ర‌బోస్.. ఈ సారి పూర్తి ఫోక్ సాంగ్ ను ప్రెజెంట్ చేశాడు. దీనికి దేవీశ్రీ ప్ర‌సాద్ త‌న‌దైన స్టైల్ లో సింపుల్ బీట్స్ తో దుమ్మురేపాడు. నిజానికి ఇది ఉత్త‌రాంధ్ర‌లో వినిపించే జాన‌ప‌దాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. మొత్తంగా రంగ‌మ్మా మంగ‌మ్మా కూడా మ‌రో బెస్ట్ సాంగ్ గా చెప్పొచ్చు. అయితే ఈ పాట‌లో సొగ‌సు విన‌డం కంటే ఎక్కువ‌గా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే వింటుంటేనే ఇది మాంటేజ్ సాంగ్ లా అనిపిస్తోంది. ఆ అందం చూపిస్తామ‌నే న‌మ్మ‌కంతోనే కాబోలు..  ఈ పాట‌లో కొరియోగ్రాఫ‌ర్ పేరు కూడా వేశారు. అంటే లిరిక్స్ కు త‌గ్గ‌ట్టుగా మాంటేజ్ లో వ‌చ్చే డ్యాన్స్ బిట్స్ కానీ, డ్రామా కానీ క‌లిపి చూస్తే ఈ పాట‌లో మ‌రింత అందాన్ని చూడొచ్చు. ఫైన‌ల్ గా ఈ లిరిక‌ల్ సాంగ్ లో స‌మంత ఎక్స్ ప్రెష‌న్స్ సంపేశాయంతే. 

More Related Stories