English   

రంగ‌స్థ‌లం.. నెక్ట్స్ టార్గెట్ చిరంజీవే..!

Chiranjeevi-charan
2018-04-03 16:15:32

ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. సిట్టిబాబు అరాచ‌కాలు వీక్ డేస్ లోనూ కొన‌సాగుతున్నాయి. విడుద‌లైన తొలి సోమ‌వారం కూడా పెద్ద‌గా డ్రాప్స్ ఏమీ లేకుండానే రంగ‌స్థ‌లం మండే టెస్ట్ పాస్ అయిపోయింది. తొలి మూడు రోజుల్లోనే 57 కోట్ల షేర్ వ‌సూలు చేసిన ఈ చిత్రం.. నాలుగో రోజు కూడా 10 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర ఖాతాలో 62 కోట్ల షేర్ వ‌చ్చి చేరిపోయింది. ఓవ‌ర్సీస్ లో అన్ని రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టుకుంటు వెళ్లిపోతున్నాడు సిట్టిబాబు. అక్క‌డ ఖైదీ నెం.150 పేరు మీదున్న 2.4 మిలియ‌న్ రికార్డు దాటేసాడు. ఇప్పుడు శ్రీ‌మంతుడు పేరు మీదున్న 2.89 మిలియ‌న్ వైపు అడుగేస్తున్నాడు. ఇదిలా ఉంటే రంగ‌స్థ‌లం చూపు ఇప్పుడు చిరంజీవి ఖైదీ వైపే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో 100 కోట్ల షేర్ అందుకున్న ఒకే ఒక్క సినిమా ఖైదీ నెం.150. ఇప్పుడు ఈ రికార్డ్ వైపే చ‌ర‌ణ్ అడుగులు ప‌డుతున్నాయి. వీక్ డేస్ లో ఏ చిన్న డ్రాప్ వ‌చ్చినా కూడా 100 కోట్లు క‌ష్ట‌మే అనుకున్నారు కానీ ఈ చిత్ర దూకుడు ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేదు. దాంతో క‌చ్చితంగా తెలుగులో రెండో 100 కోట్ల సినిమా రామ్ చ‌ర‌ణ్ దే అనే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మ‌రి చివ‌రి వ‌ర‌కు ఖైదీ రికార్డుల‌ను రంగ‌స్థలం ట‌చ్ చేస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు స‌స్పెన్స్. మ‌రికొన్ని రోజుల్లో దీనిపై కూడా ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. మ‌రి చూడాలిక‌.. తండ్రిని త‌న‌యుడు అందుకుంటాడో లేదో..? 

More Related Stories