English   

రంగ‌స్థ‌లం అమేజాన్ లో అమేజింగ్..

Rangasthalam
2018-05-14 17:20:50

రంగ‌స్థ‌లం వ‌చ్చేసింది.. అమేజాన్ ప్రైమ్ వీడియోస్ మే 14 రాత్రే విడుద‌లైంది. దాంతో అప్ప‌ట్నుంచే సిట్టిబాబు కోసం ఎగ‌బ‌డ్డారు ప్రేక్ష‌కులు. ఈ స‌మ్మ‌ర్ లో బాక్సాఫీస్ తాట తీసిన సినిమా ఇది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 120 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. పైగా ఫ్యామిలీస్ కు బాగా క‌నెక్ట్ అయ్యాడు సిట్టిబాబు. దాంతో రంగ‌స్థ‌లం అమేజాన్ లో విడుద‌ల‌వుతుందంటే ముందు నుంచీ అంతా ఆస‌క్తిగానే క‌నిపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమేజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఎన్ని సినిమాలు విడుద‌లైనా కూడా ఇంత ట్రాఫిక్ మాత్రం ఎప్పుడూ లేదు. ప‌ద్మావ‌త్ టైమ్ లో కూడా ఇంత‌గా ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డ లేదు సినిమా కోసం. కానీ రంగ‌స్థ‌లంకు జరుగుతుంది. థియేట‌ర్స్ లోనే కాదు.. అమేజాన్ లోనూ అమేజింగ్ బిజినెస్ చేస్తుంది ఈ చిత్రం. ఈ లెక్క‌లో ఈ చిత్రం కోసం అమేజాన్ పెట్టిన 12 కోట్లు కూడా ఈజీగానే రిక‌వ‌ర్ అయ్యేలా క‌నిపిస్తున్నాయి. మొత్తానికి ఏం చేస్తాం.. ఈ ఏడాది మొత్తం సిట్టిబాబుకు అలా రాసిపెట్టి ఉంది.

More Related Stories