English   

ఈస్ట్ లో చరణ్ బెస్ట్  

Rangasthalam-Ramcharan
2018-03-09 15:01:41

రంగస్థలం.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మోస్ట్ హైప్ క్రియేట్ అయిన మూవీ. రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ ఓ ఎక్స్ పర్మెంటల్ మూవీ చేయడం.. సమంత, సుకుమార్ లతో మొదటిసారి పనిచేయడం ఒక ఎత్తైతే.. ఈ కథ 1985ల నాటి కథాంశంతో సాగుతుంది. ఇక దేవీశ్రీ ప్రసా సంగీతం అందించిన రంగస్థలం పాటల్లో ఇప్పటికే మూడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మూడూ ఇప్పుడు డిజిటల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక చరణ్, సమంతల సోలో టీజర్స్ కూడా సూపర్బ్ అనిపించుకున్నాయి. మొత్తంగా మోస్ట్ పాజిటివ్ బజ్ తో రంగస్థలం బిజినెస్ స్టార్ట్ అయింది. 

 రంగస్థలం.. ఈస్ట్ గోదావరి బిజినెస్ పూర్తయింది. అయితే ఇప్పటి వరకూ ఏ మెగా హీరోకూ రాని రేట్ రంగస్థలంకు వచ్చింది. ఏకంగా ఆరుకోట్ల మూడు లక్షలకు ఈస్ట్ రేట్స్ అమ్ముడైపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150చిత్రాన్ని 5.40 కోట్లకు అమ్మేశారు. అలాగే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ ను 5.40కు రేట్స్ ఇచ్చారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు కూడా 5కోట్ల 85లక్షలకే ఇచ్చేశారు. ఇప్పుడు రంగస్థలం 6కోట్ల 3 మూడు లక్షలతో బిగ్గెస్ట్ డీల్ గా నిలిచింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉండటంతో అజ్ఞాతవాసి మాత్రం ఈ ఫిగర్ కంటే కూడా ఎక్కువ. అజ్ఞాతవాసిని పక్కన బెడితే రామ్ చరణ్ రంగస్థలమే ఇప్పటి వరకూ మెగా హీరోస్ లో హయ్యొస్ట్ రేట్ కు పోయింది. 

ఇక రంగస్థలం కు ఓవర్సీస్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అక్కడ కూడా చరణ్ కెరీర్ లో బెస్ట్ ప్రైస్ కు వెళ్లే సూచనలున్నాయి. అలాగే ఇక్కడ కూడా భారీ డీల్స్ వస్తున్నట్టు టాక్. మొత్తంగా రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచే అవకాశాలు రంగస్థలంకే ఉన్నాయి. ప్రొడక్షన్ కు కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నా.. దర్శకుడు  సుకుమార్ ఆడియన్స్ ను మళ్లీ ఆకాలానికి ఖచ్చితంగా తీసుకువెళ్లేలానే ఉన్నాడు. కాస్ట్యూమ్స్ పరంగా కూడా రంగస్థలం స్పెషాలిటీ చూపిస్తోంది. ఈ నెల 30న రాబోతోన్న రంగస్థలంతో సమ్మర్ వార్ షురూ అవుతుందనుకోవచ్చు. ప్రస్తుతం భారీ హైప్ ఉన్న రంగస్థలం ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి. 

More Related Stories