English   

వామ్మో రంగ‌స్థ‌లం 80 కోట్లంట‌..!

Rangasthalam-Charan
2018-03-26 09:41:55

ఏదో జ‌రుగుతుంది.. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఊహించ‌నిది ఏదో జ‌రుగుతుంది.. ఇన్నాళ్లూ రంగ‌స్థ‌లం అంటే రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ తో వ‌స్తోన్న సినిమా అని మాత్ర‌మే తెలుసు. కానీ ఇప్పుడు బిజినెస్ ప‌రంగా కూడా రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో అన్ని రికార్డులు తుడిచేస్తుంది రంగ‌స్థ‌లం. ఈ చిత్ర బిజినెస్ మ‌మూలుగా లేదిప్పుడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ జ‌రుగుతుంది రంగ‌స్థ‌లం బిజినెస్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నీ క‌లిపి 112 కోట్ల‌కు చేరిపోయింది. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. ఈ చిత్ర బ‌డ్జెట్ కూడా 60 కోట్ల పైనే ఉంది. నిజానికి ముందు  చిరంజీవికి రంగ‌స్థ‌లం న‌చ్చ‌లేదు. పూర్తిగా త‌న ఛాయిస్ తోనే రంగ‌స్థ‌లం క‌థ ఓకే చేసాడు చ‌ర‌ణ్. కానీ పోనుపోను చిరుకు సుకుమార్ టేకింగ్ న‌చ్చేసింది. సిట్టిబాబు పాత్ర‌ను సుక్కు డిజైన్ చేసిన విధానం చిరంజీవికి బాగా ఎక్కేసింది. ఇందులో కొన్ని స‌న్నివేశాలు చూసి నిజంగా ఫిదా అయిపోయాడు మెగాస్టార్. బంధాలు అనుబంధాల‌తో పాటు రివేంజ్ డ్రామా కూడా ఇందులో ఉండ‌బోతుంది. ముప్పై ఏళ్ల కింద రంగ‌స్థ‌లం అనే ఊళ్లో ఓ కుర్రాడికి జ‌రిగిన అన్యాయం ఏంటి.. దానికి అతడు తీర్చుకున్న బ‌దులు ఏంటి అనేది రంగ‌స్థ‌లం క‌థ‌. మార్చ్ 30న సినిమా విడుద‌ల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో 62 కోట్ల‌కు ఈ సినిమాను అమ్మారు.. ఇక ఓవ‌ర్సీస్ 9 కోట్లు.. క‌ర్ణాట‌క‌లో 8 కోట్ల‌కు అమ్మేసారు. మిగిలిన రైట్స్ అన్నీ క‌లిపి మ‌రో 30 కోట్లు వ‌చ్చాయి. మొత్తానికి ఇప్పుడు రంగ‌స్థ‌లం రేంజ్ 112 కోట్లు.. హిట్ కావాలంటే తీసుకురావాల్సిన క‌లెక్ష‌న్లు 80 కోట్ల పైనే. చూడాలిక‌.. ఇప్పుడు ఈ చిత్రం ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories