English   

రంగ‌స్థ‌లం ప్రీమియ‌ర్స్ ఉన్నాయా లేవా..? 

Rangasthalam-Premiers

ఇప్పుడు ఓ పెద్ద సినిమా విడుద‌ల‌వుతుందంటే రిలీజ్ డే వ‌ర‌కు ఆగాల్సిన ప‌నిలేదు. ముందు రోజు రాత్రే ప్రీమియ‌ర్స్ వేస్తున్నారు. దానివ‌ల్ల ప్ల‌స్ లు మైన‌స్ లు రెండూ ఉన్నాయి. పాజిటివ్ టాక్ వ‌స్తే సినిమా బ్లాక్ బ‌స్ట‌రే.. లేదంటే నిరాశ త‌ప్ప‌దు. ఇప్పుడు రంగ‌స్థ‌లం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. దీనికి కూడా ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఉన్నాయా లేవా అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా క్లారిటీ రాలేదు. అయినా ప్రీమియ‌ర్స్ అంటే చ‌ర‌ణ్ కి కూడా కాస్త భ‌య‌మే. ఎందుకంటే మూడేళ్ల కింద ఈయ‌న న‌టించిన బ్రూస్లీ సినిమాకు ముందు రోజు రాత్రే భారీగా ప్రీమియ‌ర్స్ వేసారు. చిరంజీవి రీ ఎంట్రీ కావ‌డంతో ర‌చ్చ రంబోలా చేసారు. కానీ ఫ‌లితం మాత్రం దారుణంగా వ‌చ్చింది. విడుద‌ల రోజు మార్నింగ్ షోకు సినిమా డిజాస్ట‌ర్ అని తేల్చారు. నిజానికి సినిమా యావ‌రేజ్ గానే ఉన్నా.. బ‌య‌ట టాక్ మాత్రం దారుణం అని వెళ్లింది. దాంతో బ్రూస్లీకి కోలుకోలేని దెబ్బ ప‌డింది. అది మొద‌లు మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్రీమియ‌ర్స్ అనే మాటంటేనే చ‌ర‌ణ్.. అత‌డి ఫ్యాన్స్ కు భ‌యం. 

ఇప్పుడు మ‌ళ్లీ రంగ‌స్థ‌లంకు ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఇంకా అనుమ‌తి రాలేదు. మార్చ్ 29 రాత్రి హైద‌రాబాద్ లోని శివ‌పార్వ‌తి, విశ్వ‌నాథ్ థియేట‌ర్స్ లో ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఇప్ప‌టికే చాలా చోట్ల ప‌ర్మిష‌న్స్ వ‌చ్చాయి. దాంతో రాత్రి నుంచే రామ్ చ‌ర‌ణ్ అభిమానుల ర‌చ్చ మొద‌లు కానుంది. హైద‌రాబాద్ లో మాత్రం సాయంత్రం వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఇక్క‌డ కేటీఆర్ ఎలాగూ చ‌ర‌ణ్ కు మిత్రుడే కాబ‌ట్టి ఏదో ఒక‌టి చేసి ప‌ర్మిష‌న్స్ వ‌స్తాయ‌నే అనుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పైగా ప్రీమియ‌ర్స్ ప‌డినా కూడా ఈ సినిమాకు వ‌చ్చే న‌ష్ట‌మేం లేదంటున్నాడు చ‌ర‌ణ్. ఎందుకంటే ఇది క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అని ముందు నుంచే ఫిక్స్ అయిపోయాడు ఈ హీరో. అందుకే ప్రీమియ‌ర్స్ వేసినా లాభ‌మే త‌ప్ప న‌ష్టం ఉండ‌దంటున్నాడు. పైగా సుకుమార్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఓవ‌ర్సీస్ లో కూడా సినిమా కుమ్మేయ‌డం ఖాయం. మొత్తానికి చూడాలిక‌.. బ్రూస్లీ చేదు జ్ఞాప‌కాల‌ను రంగ‌స్థ‌లం మ‌రిపిస్తుందో లేదో..?

More Related Stories