English   

చిందేసిన రంగ‌స్థ‌ల జాన‌ప‌దం..

RangaRangaRangasthalana

మ‌రో పాట వ‌చ్చేసింది. రంగ‌స్థ‌లం అదిరిపోతుంది. రోజురోజుకీ ఈ సినిమా రేంజ్ పెరిగిపోతుంది. పాట‌లు ఒక్కొక్క‌టిగా విడుద‌ల‌వుతున్న కొద్దీ సినిమా రేంజ్ మారిపోతుంది. ఇప్పుడు మ‌రోపాట కూడా విడుద‌లైంది. ఈ సారి ప‌క్కా మాస్ బీట్ విడుద‌ల చేసాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. మొన్న‌టికి మొన్న వ‌చ్చిన ఎంత స‌క్క‌గున్నావే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్పుడు రెండో పాట విడుద‌లైంది. దీనికి సంబంధించిన స్నేక్ పీక్ ఒక‌రోజు ముందే విడుద‌లైంది. నిమిషం పాటు విడుద‌లైన ఈ పాట‌లోనే దుమ్ము దులిపేసాడు దేవీ. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ వ‌చ్చింది. మేకింగ్ తో పాటు వ‌చ్చిన ఈ పాట చూస్తుంటే మెగా అభిమానులు మాత్రం చిందేయ‌డం ఖాయం. 

డ‌ప్పు చ‌ప్పుళ్ళ‌తో చిందేయ‌ని వాళ్లు కూడా చిందేయాల్సిందే. ఆ రేంజ్ లో ఫోక్ బీట్ కొట్టాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. నిజ‌మైన జాన‌ప‌ద క‌ళాకారుల‌తోనే ఈ పాట చేసాడు దేవీ. దానికే త‌న బీట్ ఇచ్చాడు. మార్చ్ 2 సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ పాట వ‌చ్చింది. రంగ రంగ రంగ‌స్థ‌లానా అంటూ సాగే ఈ పాట క‌చ్చితంగా ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డం ఖాయం. తొలిపాట‌తోనే రంగ‌స్థ‌లంపై అంచ‌నాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఈ చిత్రంతో క‌చ్చితంగా సుకుమార్ ఏదో సంచ‌ల‌నం సృష్టిస్తారు అని న‌మ్ముతున్నారు అభిమానులు. కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్య మిన‌హా బ్లాక్ బ‌స్ట‌ర్ లేని సుకుమార్.. రంగ‌స్థ‌లంతో ఆ కోరిక తీర్చుకునేలా క‌నిపిస్తున్నాడు. మార్చ్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

More Related Stories