English   

రంగ రంగ రంగ‌స్థ‌లానా.. అదిరిపోయిందిగా బీట్..

ram charan
2018-03-01 12:56:19

రంగ‌స్థ‌లం అదిరిపోతుంది. ఈ విష‌యం చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. మొన్న‌టికి మొన్న విడుద‌లైన ఎంత స‌క్క‌గున్నావే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్పుడు సినిమాలోని రెండో పాట విడుద‌ల కానుంది. దీనికి సంబంధించిన స్నేక్ పీక్ విడుద‌లైంది. నిమిషం పాటు విడుద‌లైన ఈ పాట‌లో ఊపు చూస్తుంటే రేపు ఫుల్ సాంగ్ విడుద‌లైన త‌ర్వాత డాన్సులు చేయ‌డం ఖాయం. అంత రేంజ్ లో ఫోక్ బీట్ కొట్టాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. నిజ‌మైన జాన‌ప‌ద క‌ళాకారుల‌తోనే ఈ పాట చేసాడు దేవీ. దానికే త‌న బీట్ ఇచ్చాడు. ఇప్పుడు విడుద‌లైన చిన్న బిట్ ర‌చ్చ‌ర‌చ్చ చేస్తుంది. మార్చ్ 2 సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ పాట విడుద‌ల కానుంది. రంగ రంగ రంగ‌స్థ‌లానా అంటూ సాగే ఈ పాట క‌చ్చితంగా ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డం ఖాయం. తొలిపాట‌తోనే రంగ‌స్థ‌లంపై అంచ‌నాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఈ చిత్రంతో క‌చ్చితంగా సుకుమార్ ఏదో సంచ‌ల‌నం సృష్టిస్తారు అని న‌మ్ముతున్నారు అభిమానులు. కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్య మిన‌హా బ్లాక్ బ‌స్ట‌ర్ లేని సుకుమార్.. రంగ‌స్థ‌లంతో ఆ కోరిక తీర్చుకునేలా క‌నిపిస్తున్నాడు. మార్చ్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

More Related Stories