English   

చిరంజీవికే ఎస‌రు పెడుతున్న చ‌ర‌ణ్.. 

Rangasthalam-records
2018-04-02 15:46:25

తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి 100 కోట్ల షేర్ ఎవ‌రు అందుకుంటారా అని చాలా ఏళ్లుగా ఎదురు చూసారు ప్రేక్ష‌కులు. కానీ ఆ ఫీట్ సాధించ‌డానికి చిరంజీవే రావాల్సి వ‌చ్చింది. ప‌దేళ్ళ త‌ర్వాత వ‌చ్చినా కూడా త‌న స్టామినా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఖైదీ నెం.150తో నిరూపించాడు మెగాస్టార్. ఖైదీ వ‌చ్చి కూడా ఏడాదిన్న‌ర కావొస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో 100 కోట్ల సినిమా రాలేదు. మ‌ధ్య‌లో జై ల‌వ‌కుశ‌.. స్పైడ‌ర్.. డిజే.. అజ్ఞాత‌వాసి లాంటి భారీ సినిమాలు వ‌చ్చాయి. కానీ వీటిలో ఏ ఒక్క‌టి కూడా 100 కోట్ల మార్క్ అందుకోలేదు. దాంతో ఇప్పుడు ఈ అవ‌కాశం చ‌ర‌ణ్ కు వ‌చ్చింది. ఈయ‌న న‌టించిన రంగ‌స్థ‌లం ఇప్పుడు రికార్డుల వేట సాగిస్తుంది. 

మూడు రోజుల్లోనే 54 కోట్ల షేర్ సాధించి.. తెలుగు సినిమాకు కొత్త లెక్క‌లు నేర్పిస్తుంది. బాహుబ‌లిని ప‌క్క‌నబెడితే ఇప్పుడు ఉన్న రికార్డుల్లో స‌గం రంగ‌స్థ‌లం పేరుమీదే ఉన్నాయి. అంత‌గా బాక్సాఫీస్ ను క‌నిక‌రం లేకుండా దున్నేస్తున్నాడు చ‌ర‌ణ్. ఇప్పుడు ఈయ‌న చూపు ఖైదీ నెం.150 రికార్డుల‌పైనే ఉంది. తొలి వారం 76 కోట్ల‌తో ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసాడు చిరంజీవి. ఈ రికార్డుల‌ను ఇప్పుడు చ‌ర‌ణ్ దాటేసేలా క‌నిపిస్తున్నాడు. రంగ‌స్థ‌లం దూకుడు చూస్తుంటే తొలి వారంలోనే ఈజీగా 80 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయం. మూడో రోజు కూడా సినిమా దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రెండో రోజు 13 కోట్ల షేర్ సాధించి.. బాహుబ‌లి 1 రికార్డుల‌ను సైతం తుడిచేసాడు రామ్ చ‌ర‌ణ్. ఆదివారం కావ‌డంతో మూడో రోజు రంగ‌స్థ‌లం దూకుడుకు అడ్డు లేకుండా పోయింది. మ‌రి చూడాలిక‌.. తండ్రి రికార్డుల‌ను ఈ త‌న‌యుడు అందుకుం టాడో లేదో..? 
 

More Related Stories