English   

శ్రీ‌దేవి కోసం రాణి త్యాగం..

rani mukherjee

శ్రీ‌దేవి.. శ్రీ‌దేవి.. శ్రీ‌దేవి.. ఈమె వెళ్లిపోయి అప్పుడే ఐదు రోజులు అయిపోయినా కూడా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల మ‌దిలోంచి మాత్రం బ‌య‌టికి వెళ్ల‌ట్లేదు శ్రీ‌దేవి. ఆమె జ్ఞాప‌కాల్లోనే ఉంటున్నారంతా. ఇప్ప‌టికీ శ్రీ‌దేవిని త‌లుచుకుంటూ గ‌డిపేస్తున్నారు కొంద‌రు. వ‌ర్మ లాంటి వాళ్లైతే అస‌లు బ‌య‌టికి రాలేక‌పోతున్నారు. శ్రీ‌దేవి లేద‌నే నిజాన్ని ఇప్ప‌టికిప్పుడు న‌మ్మ‌డం.. మ‌రిచిపోవ‌డం సాధ్యం కాని విషయం. ఇక ఆమెతో సుధీర్ఘ అనుబంధం ఉన్న వాళ్లు కూడా శ్రీ‌దేవి లేద‌నే విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. కొంద‌రైతే ఏకంగా పండ‌గ‌లు.. వేడుక‌లు.. సొంత సెలెబ్రేష‌న్లు కూడా శ్రీ‌దేవి కోసం మానేసారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ కూడా ఉంది. ఈమె కూడా శ్రీ‌దేవి కోసం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. శ్రీదేవి జ్ఞాపకాలు ఇప్పట్లో మరచిపోలేనని.. త‌న‌తో ఎంతో అనుబంధం ఉంద‌ని గుర్తు చేసింది ఈ భామ‌. అందుకే ఈ సారి త‌న పుట్టిన‌రోజు జరుపుకోన‌ని చెప్పింది ఈ భామ‌. మార్చి 21న రాణి ముఖర్జీ పుట్టిన‌రోజు. నా ఫేవరెట్ (శ్రీదేవి) లేదని తెలిసి నా హృదయం తల్లడిల్లిపోతోంది. ఈసారి పుట్టినరోజు చేసుకోవాలని కూడా అనిపించడం లేదు. ఈ ఏడాది నేను చాలా చాలా కోల్పోయానంటూ రాణి ముఖర్జీ క‌న్నీరు పెట్టుకుంది. రాణి ప్ర‌స్తుతం హిచ్‌కి సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని ముందుగా శ్రీదేవికే చూపించాల‌ని అనుకున్నాన‌ని చెప్పింది రాణిముఖ‌ర్జీ. అంత‌లోనే ఇదంతా జ‌రిగిపోయింద‌ని చెప్పి బాధ ప‌డింది రాణిముఖ‌ర్జీ. మొత్తానికి ఆ దేవి కోసం ఈ రాణి త్యాగం చేసింద‌న్న‌మాట‌.

More Related Stories