English   

శివ‌గామి.. త‌ట్టుకోవడం క‌ష్ట‌మే సుమీ..!

Rani-Sivagami
2018-08-06 16:44:09

ర‌మ్యకృష్ణ‌.. ఈ పేరు విన‌గానే ఒక‌ప్పుడు స్క్రీన్స్ షేక్ అయిపోయేవి.. బాక్సులు బ‌ద్ద‌ల‌య్యేవి.. త‌న హాట్ గ్లామ‌ర్ షో తో సిల్వ‌ర్ స్క్రీన్ ను వేడెక్కించింది ర‌మ్య‌కృష్ణ‌. 30 ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఐటం సాంగ్స్ తో మ‌తులు పోగొట్టింది ర‌మ్య‌. ప్ర‌భాస్, ఎన్టీఆర్ లాంటి కుర్ర హీరోల‌తో కూడా కాలు క‌దిపింది ఈ బ్యూటీ. అయితే ఏ ముద్దుగుమ్మ‌కైనా ఏజ్ లిమిట్ ఉంటుంది. అది దాటిన త‌ర్వాత కూడా గ్లామ‌ర్ షో చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ర‌మ్య‌కృష్ణ విష‌యంలో మాత్రం ఇది మిన‌హాయింపు. ఇప్ప‌టికీ ఈమె హీరోయిన్ లకు ధీటుగానే క‌నిపిస్తుంది. 

సోగ్గాడే చిన్నినాయ‌నాతో ర‌మ్య‌కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లైంది. ఆ త‌ర్వాత బాహుబ‌లితో ఈమె జాత‌క‌మే మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ల కంటే ఎక్కువ‌గా సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటూ ర‌చ్చ చేస్తుంది ఈ ముదురు ముద్దుగుమ్మ‌. ర‌మ్య‌కృష్ణ‌కు చూసిన వాళ్లెవ‌రూ 50కి చేరువ‌గా ఉంద‌నుకోరు. ప్ర‌స్తుతం శైల‌జారెడ్డి అల్లుడులో నాగ‌చైత‌న్య అత్త‌గా న‌టిస్తుంది ర‌మ్య‌కృష్ణ‌. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై సూప‌ర్ హాట్ లుక్ తో కేక పెట్టిస్తుంది ర‌మ్య‌కృష్ణ‌. ఇక ఇప్పుడు మ‌రో సినిమాతో కూడా వ‌స్తుంది ఈమె. రాణి శివ‌గామి అంటూ మ‌రో భాష‌లో వ‌చ్చిన సినిమాను ర‌మ్య‌కృష్ణ బొమ్మ చూపించి ఇక్క‌డ అమ్మేస్తున్నారు. ఏదేమైనా 50ల్లోనూ ఇలా ర‌చ్చ చేయ‌డం మాత్రం ర‌మ్య‌కృష్ణ‌కే చెల్లింది.

More Related Stories