English   

ర‌జినీ అలా.. క‌మ‌ల్ ఇలా..

rajinikanth and kamalhassan
2018-02-24 19:20:33

త‌మిళ‌నాట ఇద్ద‌రూ లెజెండ్సే. ఎవ‌రికి ఎవ‌రూ తీసిపోరు. ఒక‌రేమో మాస్ లో ఎవ‌రెస్ట్ అయితే మ‌రొక‌రు న‌ట‌న‌లో ఎవ‌రెస్ట్. ఇప్పుడు ఇద్ద‌రూ ఒకేసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వాళ్లే ర‌జినీకాంత్ అండ్ క‌మ‌ల్ హాస‌న్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. క‌మ‌ల్ హాస‌న్ ఇక తాను సినిమాలు వ‌దిలేస్తున్నాన‌ని క్లియ‌ర్ గా చెప్పేసాడు. మ‌రో రెండు సినిమాల త‌ర్వాత తాను రిటైర్మెంట్ ఇస్తున్నాన‌ని చెప్పి ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చాడు. కానీ ర‌జినీ మాత్రం ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాలు సైన్ చేస్తూ అర్థం కాని ప్ర‌శ్న‌గా మారిపోతున్నాడు. ఎన్నిక‌లు చూస్తే ఏడాది కూడా లేవు. ఇప్పుడు మ‌రో సినిమా ఒప్పుకున్నాడు సూప‌ర్ స్టార్. పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బ‌రాజ్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ర‌జినీ. ఏం చెప్పి ప‌డేసాడో తెలియ‌దు కానీ ఈ కుర్ర ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పేసాడు సూప‌ర్ స్టార్. స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమా నిర్మించ‌నుంది. ఈ మేర‌కు అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇప్ప‌టికే కాలా.. 2.0 సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌జినీకాంత్.. ఇప్పుడు మ‌రో సినిమా ఒప్పుకోవ‌డంతో ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు కానీ ఆయ‌న్ని న‌మ్మి రాజ‌కీయంగా అడుగేస్తున్న వాళ్లు మాత్రం కంగారులో ఉన్నారు. అస‌లు ర‌జినీ ఏం చేస్తున్నాడో తెలియ‌క వాళ్లు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. అస‌లే ఎన్నిక‌ల‌కు టైమ్ లేదంటే ఈ టైమ్ లో సినిమాలేంటీ బాబూ అంటూ తిక‌మ‌క‌ప‌డుతున్నారు ర‌జినీ తీరు చూసి. మ‌రోవైపు క‌మ‌ల్ మాత్రం తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా ప్లానింగ్ ప్ర‌కారం ముందుకెళ్తున్నాడు. చూడాలిక‌.. ఈ ఇద్ద‌రు లెజెండ్స్ రాజ‌కీయ సినీ ప్ర‌యాణం ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories