English   

దీపిక లోక‌ల్.. ప్రియాంక నాన్ లోక‌ల్.. 

deepika-priyanka-wedding
2018-08-16 18:47:36

అవును.. ఇప్పుడు దీపిక లోక‌ల్..! ఇడియ‌ట్ లో ర‌వితేజ‌లా చెబుతుంది ఈ భామ ఇప్పుడు. బాలీవుడ్ కు ఎంతోమంది హీరోయిన్లు వ‌స్తుంటారు పోతుంటారు కానీ తాను మాత్రం ఎప్పుడూ ఇక్క‌డే ఉంటానంటుంది. మ‌రోవైపు ప్రియాంక మాత్రం ప్ర‌కాశ్ రాజ్ లా నాన్ లోక‌ల్. పోయే హీరోయిన్ల లిస్ట్ లో త‌న పేరు రాసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు విష‌యం ఏంటంటే ఈ ఇద్ద‌రూ ఇదే ఏడాది పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే న‌వంబ‌ర్ 20న రణ్ వీర్ సింగ్ తో దీపిక పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వీళ్ళిద్ద‌రి పెళ్ళి ఇట‌లీలో ఘ‌నంగా జ‌ర‌గ‌బోతుంది. ఈ డిస్టినేష‌న్ వెడ్డింగ్ కు కేవ‌లం 30 మంది మాత్ర‌మే హాజ‌రు కానున్నారు. 

రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ర‌ణ్ వీర్, దీపిక ఇప్పుడు ఒక్క‌టి కాబోతున్నారు. ఇక ఇదే ఏడాది ప్రియాంక చోప్రా కూడా ఓ ఇంటిది కాబోతుంది. కాక‌పోతే ఆ ఇల్లు బ్రిట‌న్ లో ఉంటుంది. అక్క‌డే త‌న అత్త‌వారింటిని ఎంచుకుంది ప్రియాంక‌. ప్రియుడు నిక్ ను కూడా ఇండియాకు తీసుకొచ్చి ఆగ‌స్ట్ 18న అంద‌రికీ ప‌రిచ‌యం చేయ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. వీలైతే ఇదే ఏడాది చివ‌ర్లో పెళ్లి కూడా చేసుకోడానికి సిద్ధ‌మ‌వుతుంది. అలా ర‌ణ్ వీర్ ను పెళ్లి చేసుకుని దీపిక లోక‌ల్ అయితే.. నిక్ ను పెళ్లాడుతూ ప్రియాంక నాన్ లోక‌ల్ అవుతుంది. 

More Related Stories