English   

రణ్ వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ చేస్తున్న శంకర్

Ranveer Singh
2021-04-14 12:01:52

ప్రముఖ దర్శకుడు శంకర్ బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ తో సినిమా చేస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న  సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్  వచ్చింది. రణ్ వీర్ సింగ్ తో శంకర్ తన సినిమాలలో ఒకటైన "అన్నియాన్" సినిమాను రీమేక్  చేయబోతున్నారు. 

అన్నియాన్ సినిమా అంటే తెలుగులో విడుదలైన అపరిచితుడు సినిమానే ఇప్పుడు బాలీవుడ్ హీరోతో శంకర్ రీమేక్ చేస్తారట. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ ఈచిత్రాన్ని తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు చూసేశారు. మళ్లీ ఇదే చిత్రాన్ని రీమేక్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 ప్రాజెక్టు ఆగిపోయింది. అంతే కాకుండా శంకర్ త్వరలో రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నారు. ఇక చరణ్ తో సినిమా పూర్తయ్యాక రణ్ వీర్ సింగ్ తో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

More Related Stories