హాట్ మిర్చిలా ఉన్న రాశీఖన్నా

ఇప్పుడు ఈ భామను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. మిర్చి మ్యూజిక్ అవార్డులకు వచ్చిన ఈ బ్యూటీ.. నిజంగానే హాట్ మిర్చిలా రెడీ అయి వచ్చింది. ఆమెను చూస్తుంటే కెమెరా కళ్లే కాదు అక్కడున్న వాళ్ల కళ్లు కూడా కొట్టుకోవడం మానేసాయి. అంతగా తన అందంతో మత్తు చల్లేసింది రాశీఖన్నా. పనిలో పనిగా కాస్త క్లీవేజ్ షో కూడా చేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ టైమ్ అస్సలు బాగోలేదు. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే ఏం చేయాలో తెలియక తిక్క చూపులు చూస్తుంది రాశీఖన్నా. ఈ మధ్యే నటించిన శ్రీనివాస కళ్యాణం కూడా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ ముద్దుల ప్రియుడిపైనే ఉన్నాయి. ఇంతకీ ఈ ముద్దుల ప్రియుడు ఎవరు అనుకుంటున్నారా..? ఉన్నాడుగా మనకు ఓ ముద్దుల ప్రియుడు. అతడే విజయ్ దేవరకొండ. ఈయనతో పాటు ఈ మధ్య ప్రతీ హీరో ముద్దుల ప్రియుడే అయిపోతున్నాడు. అయితే విజయ్ కు మాత్రం ఇందులో బాగా అనుభవం ఉంది.
ఏం చేస్తాం.. అంతా అర్జున్ రెడ్డి మహిమ. అందులో డజన్ కు పైగానే ముద్దులు పెట్టుంటాడు విజయ్. ఇక ఇప్పుడు గీతగోవిందంలో కూడా రష్మిక పెదాలను చుంబించాడు ఈ హీరో. ఇప్పుడు నోటాలో కూడా ముద్దుల్ని కంటిన్యూ చేసాడు. సినిమాలో కంటెంట్ క్లీన్ గా ఉండటంతో ఈ ముద్దులు కూడా అసహ్యంగా అనిపించవు.. అందంగానే ఉంటాయి. ఈ హీరోతో రాశీఖన్నా నటించబోతుంది. క్రాంతి మాధవ్ తెరకెక్కించబోయే సినిమాలో రాశీని హీరోయిన్ గా తీసుకుంటున్నారు. కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వరస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రాశీ కెరీర్ కు ఇప్పుడు విజయ్ సినిమా ఊపిరిగా మారనుంది. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు మరో సినిమా ఏదైనా చేస్తుందో లేదంటే ఈ ముద్దుల ప్రియుడి కోసమే చూస్తుందో చూడాలి..!