English   

డబ్బింగ్ ఆర్టిస్ట్ కి సారీ చెప్పిన రాశీ ఖన్నా 

rasi
2019-05-19 10:53:42

హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. రాశీ ఖ‌న్నా న‌టించిన తాజా చిత్రం అయోగ్య‌. ఎన్టీఆర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన టెంప‌ర్ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించగా ఈ సినిమాని ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా త‌మిళం కూడా బాగా ఆడుతోంది. అయితే ఈ సినిమా పూర్త‌య్యాక వచ్చే ఎండ్ టైటిల్స్ లో వాయిస్ ఆర్టిస్టుల పేర్లు మేన్షన్ చేయలేదు. ఈ విషయం మీద రాశీ ఖ‌న్నా వాయిస్ కి డ‌బ్బింగ్ చెప్పిన డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ ర‌వీనా ఎస్‌.ఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయోగ్య చిత్రం పూర్తైన త‌రువాత వ‌చ్చే ఎండ్ టైటిల్స్‌లో డ‌బ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు లేక‌పోవ‌డం బాధ‌గా ఉందని కానీ మెస్ అన్న‌లు, డ్రైవ‌ర్లు, పెయింట‌ర్లు, కార్పెంట‌ర్లు, సౌండ్ ఇంజ‌నీర్స్‌,స్టూడియోస్‌, కో ఆర్డినేట‌ర్స్ త‌దిత‌ర డిపార్ట్‌మెంట్‌ల‌కి సంబంధించిన వారి కి క్రెడిట్స్ ఇవ్వ‌డం సంతోషంగా ఉంది. చాలా సార్లు మా కేట‌గిరికి క్రెడిట్స్ ఇవ్వ‌క‌పోవ‌డం బాధ క‌లిగిస్తోందని ట్వీట్ చేసింది ర‌వీనా. దీని మీద స్పందించిన రాశీఖ‌న్నా నన్ను క్ష‌మించు ర‌వీనా. స్క్రీన్ మీద న‌న్ను ఎలివేట్ చేయ‌డానికి అంద‌మైన గొంతు ఇచ్చిన మీకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని పేర్కొంది. ఇందుకు స్పందించిన రవీనా ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్‌ చెప్పినందుకు సంతోషంగా ఉందని రీట్వీట్‌ చేసింది.

More Related Stories