English   

భయపెట్టడానికి రెడీ అవుతున్న అందాల రాశి

rasi
2020-01-22 20:21:15

రాశిఖన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. రీసెంట్ గా వెంకీమామ, ప్రతిరోజు పండగే.. వంటి హిట్ చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే విజయ్ దేవర కొండ అప్ కమింగ్ ఫిల్మ్ 'వరల్డ్ ఫేమస్ లవర్' లోనూ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు రాశి చేసిన పాత్రలన్నీ గ్లామర్ రోల్సే కావడం విశేషం. దాంతో కెరీర్లో డిఫరెంట్ జానర్లో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది అమ్మడికి. ఇప్పుడా కోరిక త్వరలోనే నెరబేరబోతోంది.

కోలీవుడ్ లో సుందర్‌. సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీస్ అరణ్మనై, అరణ్మనై2 ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఇప్పుడు మరో సీక్వెల్ 'అరణ్మనై3' ప్లాన్ చేస్తున్నాడు సుందర్.సి.. ఈ సినిమాలోనే రాశిఖన్నా హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది. దాంతో హారర్‌ జానర్‌ మూవీ చేయాలనే కోరిక.. అరణ్మనై సిరీస్ తో నెరవేరబోతోందని సంతోషపడిపోతోంది. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోందట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఆండ్రియా మరో కథానాయికగా నటిస్తుండగా.. ఆర్య హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఇందులోనూ సుందర్‌.సి కీ రోల్ పోషించబోతున్నాడు. మరి ఈ అందాల రాశి.. ఎలా భయపెడుతుందో చూడాలి.

More Related Stories