English   

జబర్దస్త్ బ్యూటీకి కరోనా పాజిటివ్

 Rashmi Gautam
2020-10-23 16:22:57

కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. సినీ తారలతో పాటు టీవీ సెలబ్రెటీలను సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. తాజాగా జబర్దస్త్ బ్యూటీ రష్మీ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. దాంతో రష్మీ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అయితే రష్మీ ఆరోగ్య పరిస్థితి పై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల సుడిగాలి సుదీర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. దాంతో సుదీర్ కూడా హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సుదీర్, రష్మికి కరోనా పాజిటివ్ రావడంతో వాళ్ళు శుక్రవారం జరగాల్సిన జబర్దస్త్ షూటింగ్ ను వాయిదా వేసుకున్నట్టు సమాచారం. షూటింగ్ ను అక్టోబర్28 కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ అప్పటివరకూ వారికి నెగిటివ్ రాకపోతే షూటింగ్ ను నవంబర్ కు వాయిదా వేయనున్నారట. మరోవైపు హీరో రాజశేఖర్ కూడా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. రాజశేఖర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే రాజశేఖర్ కు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు.

More Related Stories