English   

రష్మి అందాలను అంతమంది చూశారా..?

Rashmi-Gautam
2018-09-25 17:00:54

రష్మి... జబర్ధస్త్ తో ఫేమ్ అయిన బ్యూటీ. బుల్లితెరపై హాట్ హాట్ గా కనిపిస్తూ అప్పటి వరకూ హాట్ గా కనిపించిన అనసూయ అందాలను డామినేట్ చేసేలా ‘థై షో’స్ తో దుమ్మురేపిన రష్మి అంతకు ముందే కొన్ని సినిమాల్లో నటించింది. హీరోయిన్ ఫ్రెండ్ గానో.. లేదంటే ఏవో చిన్న పాత్రల్లోనో కనిపించింది. మొత్తంగా ఎలా పట్టిందో కానీ జబర్దస్త్ యాంకర్ గా తను ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయింది. తన అందాలకు ఫిదా కానివారు లేరు. పైగా వచ్చీరాని తెలుగుతో తను మాట్లాడే విధానంతో పాటు సుధీర్ తో లవ్వాయణం వంటి రూమర్స్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. మరి అంత క్రేజ్ ఉంటే వెండితెర వదులుతుందా.. చాలా ఆఫర్స్ వచ్చాయి. చిత్రంగా అవన్నీ హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కథలే. మొత్తంగా ఆ సినిమాలేవీ ఆడకపోయినా అమ్మడికి డిమాండ్ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా అంతకు మించి అనే ఓ సినిమా వచ్చింది. కేవలం తన తొడలను పోస్టర్స్ పై చూపించే ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే ప్రయత్నం చేశారీ మూవీ మేకర్స్.. 

వారి ప్రయత్నం ఫలించి మాగ్జిమం ఓపెనింగ్స్ వచ్చాయీ సినిమాకు. బట్ ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయినా సినిమాలోని రష్మిక హాట్ సాంగ్ ను మాత్రం ఏకంగా ఒన్ మిలియన్ మంది చూశారట. అంటే రష్మి అందాలను పదిలక్షల మందికి పైగా వీక్షించారన్నమాట. నిజానికి ఇందులోనూ తనది ‘ థై షో’నే. ఆ అందాలను ఫిదా అయ్యి ఎంతో మంది ఈ పాటను యూ ట్యూబ్ లో తెగ చూసినట్టున్నారు. అందుకే ఒక్క పాటకే మిలియన్ వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ లో కాస్త కంటెంట్ ఉన్న సినిమాలకు కమిట్ అయితే ఇలాంటి పాటలు చేయాల్సిన పని ఉండదని చెప్పారు. కానీ రష్మిని ఇలా కాక సంప్రదాయంగా చూపిస్తే చూస్తారా..? 

More Related Stories