English   

ర‌ష్మికను లైట్ తీసుకున్నారో..!!

rashmika mandanna - 01
2018-07-02 19:06:28

తెలుగు ఇండ‌స్ట్రీకి ఓ అల‌వాటు ఉంది. కొత్త ముద్దుగుమ్మ‌లు కాస్త టాలెంట్ చూపిస్తే చాలు అక్కున చేర్చుకుంటుంది. ఈ మ‌ధ్య సాయిప‌ల్ల‌వి, కీర్తి సురేష్ లాంటి వాళ్లంతా ఇలా వ‌చ్చిన వాళ్లే. ఇప్పుడు ఇదే కోవ‌లోకి ర‌ష్మిక మంద‌న్న కూడా చేరిపోయింది. ఈమె ఎక్కువ‌గా అందాల ఆర‌బోత‌ను న‌మ్ముకునే బ్యాచ్ కాదు.. న‌ట‌న‌ను న‌మ్ముకునే బ్యాచ్. అవ‌స‌రం అనుకున్న‌పుడు అందాలు కూడా ఆర‌బోస్తుంది. తొలి సినిమాతోనే సౌత్ ఇండ‌స్ట్రీ మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకుంది ర‌ష్మిక‌. క‌న్న‌డ‌లో కిరిక్ పార్టీతో ర‌ష్మిక హాట్ టాపిక్ అయిపోయింది. తెలుగులోనూ ఈమె న‌టించిన ఛ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. పైగా ఈ చిత్రంలో సొంత డ‌బ్బింగ్ తోనే అల‌రించింది ర‌ష్మిక‌. 

ఇందులో అమ్మ‌డి యాక్టింగ్ కు కుర్రాళ్ళంతా ఫిదా అయిపోయారు. మ‌రీ ముఖ్యంగా ఛ‌లోలో ర‌ష్మిక ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తెగ న‌చ్చేసాయి ప్రేక్ష‌కుల‌కు. అందుకే ఛ‌లో సెట్స్ పై ఉన్న‌పుడే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో గీతాగోవిందంలో జోడ‌క‌ట్టింది ర‌ష్మిక‌. ఈ సినిమా షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. నానితో ఓ సినిమాలో న‌టిస్తుంది ర‌ష్మిక‌. శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తోన్న సినిమాలో నానికి జోడీగా ర‌ష్మిక‌.. నాగార్జున‌కు జోడీగా మ‌ళ్లీరావా ఫేమ్ ఆకాంక్ష సింగ్ న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇక ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే మ‌రోసారి డియ‌ర్ కామ్రేడ్ లో న‌టిస్తుంది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇవ‌న్నీ హిట్ అయితే దెబ్బ‌కు స్టార్ హీరోయిన్ అయిపోతుంది. మొత్తానికి వ‌ర‌స సినిమాల‌తో తెలుగులో సైలెంట్ గా సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది ఈ కిర్రాక్ హీరోయిన్.
 

More Related Stories