English   

సిబ్బంది జీతాలు కట్ చేస్తున్న రష్మిక మందన్న..

rashmika
2020-05-27 20:01:40

అదేంటి కరోనా వైరస్ కారణంగా వచ్చిన లాక్ డౌన్ తో పనిలేక పాపం అందరి జీతాలు కోస్తున్నారు కదా.. అందులోనే రష్మిక మందన్న కూడా ఉందా అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈమె లెక్క మరోలా ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ కూడా తనకు కావాల్సినట్లుగా హాయిగా ఎంజాయ్ చేస్తుంది రష్మిక మందన్న. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చట్లు చెప్పుకుంటుంది. అందులోనే అప్పుడప్పుడూ వాళ్లకు పరీక్షలు కూడా పెడుతుంది ఈ బ్యూటీ.

ఇప్పుడు కూడా ఇదే చేసింది రష్మిక. తన గురించి సిబ్బందితో పాటు తమ వాళ్లకు కూడా ఎంత బాగా తెలుసు అంటూ ఓ టెస్ట్ పెట్టింది రష్మిక. అందులో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా అడిగింది. అయితే వాటికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు. తన గురించి ఎవరికీ సరిగ్గా తెలియదని.. చివరికి తన స్టాఫ్ కూడా సరిగ్గా చెప్పలేదని కోపంతో ఉన్న ఎమోజీ పెట్టింది రష్మిక. నేను మీ అందరి జీతాలు కట్ చేస్తున్నాను పోండి అంటూ ట్వీట్ చేసింది. అయితే ఇదంతా ఆమె కామెడీతోనే చేసిందనేది అందరికి తెలుసు. కానీ జీతాలు కట్ చేస్తాననే మాట మాత్రం కరోనా కాలం కావడంతో వైరల్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె తెలుగులో అల్లు అర్జున్ పుష్పతో పాటు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టింది. ఇక కన్నడలో కూడా వరస సినిమాలు చేస్తుంది.

More Related Stories