English   

పుష్పపై అలిగిన రష్మిక ఫ్యాన్స్ 

Rashmika Mandanna
2021-04-07 11:50:11

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఇప్పటికే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న మూడవ సినిమాగా పుష్ప తెరకెక్కుతోంది. దాంతో ఈసారి హ్యాట్రిక్ పక్కా అని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. అంతే కాకుండా ఆగస్ట్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

అంతే కాకుండా అల్లు అర్జున్ బర్త్ డే సంధర్బంగా సినిమా టీజర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక్కడివరకు అంతా బాగానే  ఉంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. కానీ ఇప్పటి వరకు రష్మిక లుక్ మాత్రం రిలీజ్ చేయలేదు. మొన్న రష్మిక బర్త్ డే కు కూడా సినిమా నుండి రష్మిక ఫ్యాన్స్ కోసం ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు. కానీ అల్లు అర్జున్ పై మాత్రం ప్రతిదీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక ఫ్యాన్స్ గరం గరం అవుతున్నారు. సుకుమార్ గారు మీ సినిమాలో రష్మిక నటిస్తున్నట్టు గుర్తుందా అంటూ డైరెక్టర్ ను ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ఎందుకంత పక్షపాతం అంటూ ప్రశ్నిస్తున్నారు.

More Related Stories