మిషన్ మంజును మొదలు పెట్టిన రష్మిక

కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం కన్నడ తో పాటు తెలుగు తమిళ సినిమాల్లోను నటిస్తు ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. రష్మి బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర సరసన మిషన్ మంజు అనే సినిమాలో నటిస్తోంది. కాగా తాజాగా ఈరోజు సినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఆర్ ఎస్ వీపీ, గిట్లీ అనే బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో రష్మిక పాకిస్తాన్ లో జరిగే రహస్య ఆపరేషన్ కు భారత రా ఏజెంట్ గా రష్మి క నటిస్తోంది. ఇదిలా వుండగా రష్మిక టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోల సరసన నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో రష్మిక నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ లుక్ వైల్డ్ గా ఉండి అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుండగా...రష్మిక లుక్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాంతో రష్మిక లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు