English   

పెట్రోల్ బంక్ లో చేరిన రష్మిక మందన్నా

Rashmika-Mandanna

అటు కన్నడలో కిరిక్ పార్టీ, ఇటు తెలుగులో ఛలో.. ఈరెండు ఫస్ట్ మూవీస్ తోరెండు భాషల్లోనూ బెస్ట్ ఇంప్రెషన్ వేసిన శాండల్ వుడ్ సోయగం రష్మిక మందన్నా.. ఇక తెలుగులో ఛలోతో ఓవర్ నైట్ హాట్ ఫేవరెట్ మారిన ఈ భామ ఆల్రెడీ ఎంగేజ్డ్. అయినా సినిమాల్లో బిజీ అవుతోంది. ఫస్ట్ మూవీలో తనతో కలిసి నటించిన రక్షిత్ శెట్టితో ఈ భామ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అయినా ఆఫర్స్ ఆగలేదు. దీంతో అటు కన్నడ, ఇటు తెలుగులోనూ కంటిన్యూస్ గా సినిమాలు చేస్తోన్న రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో గీతగోవిందంలో నటించింది. 

ఇక లేటెస్ట్ గా అమ్మడు ఓ పెట్రోల్ బంక్ లో ఉద్యోగిగా చేరింది. ఈ వార్త శాండల్ వుడ్ లో హాట్ టాపిక్ అయింది. అరే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేస్తారు అనే డౌట్ ఎవరికైనా వస్తుంది కదా.. అఫ్ కోర్స్ .. కానీ అమ్మడు పర్మనెంట్ గా పెట్రోల్ బంక్ ఎంప్లాయ్ గా జాయిన్ కాలేదు. కొద్దిసేపు మాత్రమే బంక్ లో పెట్రోల్ కొట్టి డబుల్ త్రిబుల్ రేట్స్ వసూలు చేసింది. మరి ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా..? కన్నడలో వస్తోన్న ఓ టివి షోకోసం. అది ఇలా సెలబ్రిటీస్ తో పని చేయించి వచ్చిన డబ్బులతో అభాగ్యులను ఆదుకునే షో అన్నమాట. అంటే తెలుగులో మన మంచు లక్ష్మి చేసే మేము సైతం అనే షో లాగా అన్నమాట.. 

‘సదా నిమ్మొందిగే’ అనేపేరుతో సాగే ఈ షోకోసం రష్మికతో పాటు కన్నడ హీరో ధృవ్ షార్జా కూడా ఆటో నడిపించాడు. ఈ ఇద్దరూ కలెక్ట్ చేసిన డబ్బులను జూలై 15న టెలీకాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో కొందరు అభాగ్యులకు అందించబోతున్నారన్నమాట. అన్నట్టు ఈ కన్నడ షో నిర్వహిస్తోన్న యాంకర్ పేరు కూడా లక్ష్మి కావడం విశేషం. 

More Related Stories