English   

గోవిందం గీత బాధితుడులా ఉన్నాడే

Geetha Govindam Latest Poster
2018-07-29 21:58:40

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న గీత గోవిందం ఆడియో ఫంక్షన్ లో ఓ వీడియో విడుదల చేశారు. కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన ఇంకేం ఇంకేం కావాలే పాటకు సంబంధించిన వీడియో అది. ఈ వీడియో సాంగ్ చూస్తే గీత పెట్టే టార్చర్ కు గోవిందం ను చూస్తే పాపం అనిపించక మానదు. మరి ఆస్థాయిలో గోవిందంను ఇబ్బంది పెట్టేస్తోంది గీత. ప్రతిదానికీ కండీషన్స్, అతనికంటూ ఏ స్వేచ్ఛ లేకుండా అమ్మడు తెగ ఇబ్బంది పెట్టేలా ఉంది. ఆఖరికి తను చేసిన డ్యాన్స్ కు చప్పట్లు కొట్టినా ఇబ్బందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి ఇలా ఉండే జంటలు పూర్తికాలం కలిసుంటారా అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే. నిజానికి ఈ సినిమా పాయింట్ కూడా ఇదేలా ఉంది.

ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయి, అమ్మాయి కలిసి పెళ్లికి ముందు చేసే జర్నీ.. ఈ జర్నీలో వారి మధ్య వచ్చే ఎమోషన్స్.. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, అడ్జెస్ట్ కాకపోవడం వీటి ద్వారా వచ్చే సంఘర్షణలు ఎమోషన్స్ ఇలా వీటన్నిటి కలబోతగానే ఈ కథ కనిపిస్తోంది. ఏదేమైనా ఇంకేం ఇంకేం కావాలే పాట వినడానికి పూర్తి భిన్నంగా చూడ్డానికి ఉండటం మాత్రం ట్విస్ట్ అనే చెప్పాలి.

More Related Stories