English   

చ‌ర‌ణ్ శంకర్ సినిమాకు ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్

 Rashmika
2021-04-15 17:41:56

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన చ‌ర‌ణ్ లుక్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ప్యాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా వెంట‌నే చ‌ర‌ణ్ మ‌రో ప్యాన్ ఇండియా ప్రాజ‌క్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అంతే కాకుండా శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులైలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో హీరోయిన్ గా ర‌ష్మిక ను సంప్ర‌దిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో న‌టించేందుకు ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. 

ద‌ర్శ‌కుడు శంక‌ర్ చెప్పిన స్టోరీ విని ర‌ష్మిక ఇంప్రెస్ అయింద‌ట‌. అంతే కాకుండా సినిమాలో న‌టించేందుకు వెంట‌నే ఆమోదం తెలిపింద‌ట‌. ఇదిలా ఉండ‌గా ర‌ష్మిక ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజ‌క్టుల‌తో ఫుల్ బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప సినిమాలో ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా ఇప్ప‌టికే మ‌హేశ్ బాబు తో ఓ సినిమా చేసింది. ఇక ఇప్పుడు చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింది. 

More Related Stories