English   

‘సైరా’పై సినిమాటోగ్రాఫర్ అప్డేట్ చూశారా..?

Ratnavelu
2018-10-15 21:19:39

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘సైరా’. రాయలసీమకు చెందిన బ్రిటీష్ వారిని వ్యతిరేకించిన తొలి తెలుగు వాడిగా ఖ్యాతి తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు కాస్త ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తోన్న చిత్రం ఇది. చిరంజీవి 151వ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ మూవీ ఇది. ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్నా, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సుదీప్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ, పూనమ్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే లేటెస్ట్ గా సైరాకు సంబంధించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ కీలకమైన అప్డేట్ ను ట్వీట్ చేశాడు. 

సైరా మూవీకి సంబంధించి ప్రస్తుతం కీలక సన్నివేశాలను జార్జియా దేశంలో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ ఇది క్లైమాక్స్ అట. చాలామంది కీలక సీన్స్ అనుకున్నారు కానీ.. ఇదే క్లైమాక్స్ కూడానట. అందుకే మాగ్జిమం కాస్ట్ అండ్ క్రూ అంతా జార్జియాలోనే ఉందిప్పుడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రత్నవేలు చేసిన ట్వీట్ తో ఈ క్లైమాక్స్ తర్వాత సినిమాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చినట్టైంది. క్లైమాక్స్ చిత్రీకరించినంత మాత్రాన సినిమా అయిపోయిందని కాదు కానీ.. సినిమాకు ఇదే అత్యంత కీలకమైన ఎపిసోడ్. మరోవైపు ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. అంటే మిగిలిన షెడ్యూల్ లో కొన్ని పాటలు చిత్రీకరిస్తారని చెబుతున్నారు. సో.. చూస్తోంటే సినిమా అనుకున్న టైమ్ కంటే ముందే వచ్చే అవకాశం కూడా ఉంది. 

More Related Stories