English   

ర‌వితేజ ముగ్గురు మొన‌గాళ్లు కాదు.. 

Ravi-teja
2018-06-21 18:43:15

అదేంటి.. ర‌వితేజ‌తో ముగ్గురు మొన‌గాళ్లు సినిమాకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డ ముగ్గురు మొన‌గాళ్లు అంటే చిరు సినిమా కానే కాదు. ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ గురించి చ‌ర్చ‌. శీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న ప్ర‌స్తుతం ఈ చిత్రం చేస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం ర‌వితేజ ఉన్న ఫామ్ దృష్ట్యా ఈయ‌న కెరీర్ కు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కీల‌కంగా మారింది. 

ఎందుకంటే ర‌వితేజ గ‌త రెండు సినిమాలు ట‌చ్ చేసి చూడు.. నేల‌టికెట్ క‌నీసం 10 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయాయి. ర‌వితేజ మార్కెట్ ఎలా ప‌డిపోయిందో ఈ రెండు సినిమాలే సాక్ష్యం. దాంతో ఇప్పుడు క‌చ్చితంగా హిట్ కొట్టి త‌న మార్కెట్ నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితుల్లో ప‌డిపోయాడు మాస్ రాజా. ఇలాంటి టైమ్ లో హిట్ల‌లో ఉన్న ద‌ర్శ‌కుడితో సినిమా చేయాలి కానీ ర‌వితేజ మాత్రం హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చిన శీనువైట్ల‌తో సినిమా చేస్తున్నాడు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అనే టైటిల్ ఉన్నా ఇందులో ర‌వితేజ చేస్తున్న‌ది మూడు పాత్ర‌లు మాత్రం కాదు. ఆ టైటిల్ ఎందుకు పెట్టాం అనేది థియేట‌ర్ కు వ‌చ్చి తెలుసుకోండంటూ అప్ప‌ట్లో ఫ‌జిల్ వ‌దిలాడు శీనువైట్ల‌. 

అయితే ఇప్పుడు వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ముగ్గురిలా క‌నిపించి.. బ్రేక్ టైమ్ కు తూచ్ అంతా ఒక్క‌రే అని చూపిస్తాడ‌ని తెలుస్తుంది. అందుకే ఈ మూడు పేర్లు ఉండేలా టైటిల్ పెట్టాడు వైట్ల‌. మ‌రి చూడాలిక‌.. ఈ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ర‌వితేజ‌, శీనువైట్ల‌ను బ‌య‌ట ప‌డేస్తారో లేదో..?

More Related Stories