English   

అజిత్ డైరెక్టర్ తో రవితేజ సినిమా

Ravi Teja
2021-04-12 14:58:19

మాస్ మహరాజ్ రవితేజ ఈ యేడాది ప్రారంభం లో "క్రాక్" సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పాటూ లాక్ డౌన్ తరవాత విడుదలయ్యే సినిమాలకు భరోసా ఇచ్చింది. యాబై శాతం సీటింగ్ లోనూ వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమా తరవాత వెంటనే రవితేజ ఖిలాడి సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా తరవాత రవితేజ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా రవితేజ మరో సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు అజిత్ మరియు కమల్ హాసన్ లతో సినిమాలు తీసిన శరత్ మండవ తో మాస్ మహరాజ్ సినిమా ఉండబోతుందట. ఇప్పటికే దర్శకుడు రవితేజ కు స్టోరీ చెప్పగా ఆయన వెంటనే ఒకే చెప్పారట. 

ఒక నిజ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెకించబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.  అంతే కాకుండా ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రానికి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

More Related Stories