English   

ముగ్గురు మొనగాళ్లుగా మాస్ రాజా

Ravi-Teja-Film
2018-03-09 07:45:10

మాస్ మహరాజ్ రవితేజ కొత్త సినిమా ప్రారంభమైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోందీ చిత్రాన్ని. అమర్ అక్బర్ ఆంటోనీ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో  అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్.. మాస్ రాజా ఫేవరెట్ ఒన్.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మొదటి సారి రవితేజ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అంటే మరో ఇద్దరు హీరోయిన్లకు స్పేస్ ఉంటుంది. ఆ ఇద్దర్ని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారు. ఇక రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తోన్న నాలుగో సినిమా ఇది. గతంలో వీరి కాంబోలో నీకోసం, వెంకీ, దుబాయ్ శీను వచ్చాయి. ఈ మూడూ మంచి విజయాలే నమోదు చేశాయి. వెంకీ సినిమా ఒకరకంగా శ్రీను వైట్లకు స్పెషల్ ఇమేజ్ తెచ్చింది. ఆ ఇమేజ్ ఆయన చాలా సినిమాలు చేశారు కూడా. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది కూడా హిలేరియస్ ఎంటర్టైనర్ అయ్యే ఉంటుందనుకోవచ్చు. 

ఈ సినిమాకు సంబంధించి మరో హైలెట్ ఏంటంటే.. స్టార్ కమెడియన్ సునిల్ మళ్లీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ, శ్రీను వైట్ల, సునిల్ కాంబినేషన్ కు కూడా హిలేరియస్ రికార్డ్ ఉంది. మొత్తంగా త్రివిక్రమ్ సినిమాతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తాడనుకుంటే సునిల్ రవితేజతో రాబోతుండటం ఆశ్చర్యం. ఓ రకంగా ఈ సినిమాకు సునిల్ కూడా పెద్ద ప్లస్ అవుతాడని వేరే చెప్పక్కర్లేదు. సో అమర్ అక్బర్ ఆంటోనీతో సునిల్ అదరగొట్టబోతున్నానుకోవచ్చు. 

అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ సక్సెస్ ట్రాక్ లో లేరు. శ్రీను మరీ డల్ అయిపోయాడు. హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ టైమ్ లో రవితేజ మళ్లీ అతనితో నటించడం కొంత ఆశ్చర్యమే అయినా.. కంటెంట్ ఉంటే కమిట్ అవడానికి ఏ హీరో మాత్రం ఇబ్బంది పడతాడు. పైగా ఇది మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న సినిమా కాబట్టి.. మాగ్జిమం గ్యారెంటీ అనుకోవచ్చు. ఇటు రవితేజ్ కూడా కొంతవరకూ ఇబ్బందుల్లోనే ఉన్నాడు.ఈ నాలుగేళ్లలో రాజా ది గ్రేట్ మాత్రమే హిట్. రీసెంట్ గా వచ్చిన టచ్ చేసి చూడు కూడా పోయింది. ప్రస్తుతం నేలటికెట్ అనే సినిమా చేస్తున్నాడు.

అయితే రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ కు ఓ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను కంటిన్యూ చేసే స్క్రీన్ ప్లేనే మళ్లీ నమ్ముకుంటే కష్టం. ఎందుకంటే ఆ రోజులు పోయాయి. నిజానికి ఇప్పడు శ్రీను వైట్లకు ఈ చాన్స్ రావడం గొప్ప విషయమే. మరి ఇప్పుడైనా ఆ చాన్స్ ను నిలుపుకుని మళ్లీ ఫామ్ లోకి వస్తే.. మళ్లీ స్టార్ హీరోలూ శ్రీను వైపు చూసే అవకాశం ఉంది. ఎనీవే.. మైత్రీ మూవీస్ నుంచి వస్తోన్న ఈ సిక్త్స్ ప్రాజెక్ట్ కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం.. 

More Related Stories