English   

రవితేజకు హెల్త్ ప్రాబ్లమా.. ?

ravi teja
2018-02-27 15:40:22

మాస్ మహరాజ్ రవితేజ.. ఎనర్జీకి డెఫినేషన్ లా ఉంటాడు. ఏజ్ బార్ అవుతోన్న ఏ మాత్రం జోష్ తగ్గని స్టార్. అలాంటిది రవితేజ హెల్త్ పై కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పాడైందనీ.. బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారనే న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఆయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ విషయం పై రియాక్ట్ అయ్యాడు. మాస్ రాజాకు ఏమీ కాలేదు. అతను సూపర్ గా ఉన్నాడు. ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా ఉన్నాడు అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నేల టికెట్(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ మూవీ. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుకచూద్దాం వంటి హిట్స్ తో జోష్ మీదున్న కళ్యాణ్.. ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అటు రవితేజ టచ్ చేసి చూడు ఫ్లాప్ తో కొంత ఇబ్బందిపడ్డా.. మళ్లీ ఈ మూవీతో ఫామ్ లోకి వస్తాననే నమ్మకంతో ఉన్నాడు.

మొత్తంగా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న నేల టికెట్ షూటింగ్ లో రవితేజ ఆరోగ్యం పాడైందనీ.. ఆయన పరిస్థితి బాలేదనీ.. కంప్లీట్ గా కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారనే రూమర్స్ వచ్చాయి. ఇవి కాస్త ఓవర కావడంతో ఎప్పట్లాగే రవితేజ పట్టించుకోలేదు కానీ.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రవితేజపై వస్తున్నవన్నీ రూమర్స్ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. కాకపోతే నిప్పు లేకుండా పొగరాదు కదా అనే సామెత మరోసారి గుర్తు చేసుకుని కళ్యాణ్ ట్వీట్ తో కామ్ అయిపోవడం తప్ప ఎవరు మాత్రం ఏం చేస్తారు.

More Related Stories