English   

ర‌వితేజ సినిమాకు అప్పుడే 25 కోట్లా..? 

Ravi-Teja-Kalyan

ర‌వితేజ మార్కెట్ ప‌డిపోయింది.. ఈయ‌నతో సినిమా చేస్తే ఇప్పుడు నిర్మాత‌ల‌కు అనుకున్నంత లాభాలు రావు.. బ‌య్య‌ర్ల ప‌రిస్థితి అంతే అంటూ ఈ మ‌ధ్య చాలా వార్త‌లు వ‌చ్చాయి. ట‌చ్ చేసి చూడు డిజాస్ట‌ర్ కూడా దీనికి ఊతం ఇచ్చింది. అయితే ఆ సినిమా ఫ‌లితం వ‌చ్చి మూడు వారాలు కూడా కాలేదు అప్పుడే ర‌వితేజ రేంజ్ ఏంటో మ‌రోసారి నిరూపించింది క‌ళ్యాణ్ కృష్ణ సినిమా. ఈ సినిమా షూటింగ్ జ‌న‌వ‌రిలో మొద‌లైంది. ఇప్ప‌టికే 40 శాతం షూటింగ్ పూర్త‌యింది కూడా. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియ‌దు.. ఏ కాన్సెప్ట్ తో వ‌స్తుందో తెలియ‌దు కానీ అప్పుడే నిర్మాత‌కు 25 కోట్లు వ‌చ్చాయి. అది కూడా కేవ‌లం ర‌వితేజ‌కు ఉన్న ఇమేజ్ వ‌ల్లే. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ఈ సినిమా డిజిట‌ల్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ అమ్ముడ‌య్యాయి. ఒక‌టి రెండు కాదు ఏకంగా 25 కోట్ల‌కు ఈ రైట్స్ వెళ్లాయి. దాంతో నిర్మాత ఇప్పుడు ఆనందంలో తేలిపోతున్నాడు. మాస్ రాజా సినిమాల‌కు హిందీలో చాలా గిరాకీ ఉంటుంది. ఈయ‌న ప్ర‌తీ సినిమా అక్క‌డ టీవీల్లో సూప‌ర్ హిట్టే. దాంతో బొమ్మ ఎలా ఉంటుందో తెలియ‌కుండానే ఇప్పుడు నేల‌టికెట్ ను భారీ రేట్ కు కొనేసారు. పైగా క‌ళ్యాణ్ కృష్ణ‌కు సోగ్గాడే చిన్నినాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం రూపంలో రెండు విజ‌యాలున్నాయి. దాంతో ఈ సినిమాపై కూడా అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. మొత్తానికి విడుద‌ల‌కు ముందే నిర్మాత సేఫ్. అందుకు క‌దూ.. మాస్ రాజా ఇప్ప‌టికీ సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఇంత బిజినెస్ జ‌రుగుతుందంటే అత‌డికి అంత ఇవ్వ‌డంలో త‌ప్పేం లేద‌స‌లు..!

More Related Stories