English   

ఇంట్రెస్టింగ్.. విలన్ గా మాస్ మహారాజా

Ravi Teja
2020-01-17 17:29:02

గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'రాజా ది గ్రేట్' కొంత ఊరటనిచ్చినా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. దాంతో.. ఈ సారి వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న 'డిస్కోరాజా' చిత్రం పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. నభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ మూవీ.. జనవరి 24వ తేదిన విడుదల కానుంది.
    
ప్రస్తుతం డిస్కోరాజా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు రవితేజ. అందులోభాగంగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ చాలా ఆసక్తికర విషయాలు చెప్పాడు. తనకు ఎలాంటి జానర్ సినిమాలంటే ఇష్టమంటే.. ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడతానని చెప్పాడు. అందుకే కిక్, విక్రమార్కుడు వంటి సినిమాలు చేసానని చెప్పారు. అదే విధంగా మధ్య మధ్యలో.. నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, నేనింతే వంటి సినిమాలు చేసినప్పటికీ.. అవి ఆడలేదన్నారు. 
    
ప్రస్తుతం ప్రేక్షకులు డిఫరెంట్ జానర్, కంటెంట్ ఉన్న సినిమాలు కోరుకుంటున్నారని, అలాంటి టైంలో వచ్చిందే 'డిస్కోరాజా' చిత్రమని అన్నారు. అంతేకాదు.. టోటల్ నెగిటివ్ గా, భిన్నంగా, కొత్తగా ఉండే విలన్ పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. దీంతో రవితేజ మాటలు చూస్తుంటే త్వరలో విలన్ అవతారం ఎత్తడం ఖాయమంటున్నారు. మరి.. 'డిస్కోరాజా' రవితేజకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
 

More Related Stories