English   

రవితేజ బర్త్ డే గిఫ్ట్ గా ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్

 Ravi Teja Khiladi
2021-01-26 13:18:00

మాస్ మహరాజ్ రవితేజ ఏ ఏడాది క్రాక్ హిట్ తో బోణీ కొట్టాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రవితేజ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సినిమా విడుదలై 16 రోజులు గడుస్తున్నా థియేటర్ ల వద్ద ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్ లకు లాభాల పంట పండుతోంది. అంతే కాకుండా గోపిచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన మూడో సినిమా క్రాక్ హిట్ అవ్వడంతో ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా రవితేజ ప్రస్తుతం "ఖిలాడి" అనే సినిమాలో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈరోజు రవితేజ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్  గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. ఈ వీడియోలో రవితేజ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. సుత్తి పట్టుకుని స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి,  డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. చిత్రాన్ని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

More Related Stories