English   

మాస్ మహారాజ్ ఖిలాడీ టీజర్ టాక్ 

Ravi Teja Khiladi​​
2021-04-12 10:41:07

రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖిలాడి’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ‘ఉగాది’ కానుకగా  విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఉత్కంఠగా సాగిన ఈ టీజర్‌లో రవితేజ నటన, స్టైల్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ఇక రవితేజ సంక్రాంతికి క్రాక్ సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు. 

More Related Stories