English   

రవితేజ క్రాక్ ఆ తమిళ సినిమా ఫ్రీమేక్ కాదు కదా..

 Ravi teja
2020-02-22 10:45:56

డిస్కో రాజా సినిమాకి వచ్చిన కలెక్షన్లు చూసిన తర్వాత పాపం ఎలా ఉండే రవితేజ ఎలా అయిపోయాడు అంటూ జాలి పడుతున్నారు. ప్రతి హీరోకు కూడా కచ్చితంగా కెరీర్లో ఏదో ఒక సమయంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయి. బలుపు సినిమాకు ముందు రవితేజకు ఇలాంటి సిచువేషన్ ఒకసారి వచ్చింది. రాజా ది గ్రేట్ హిట్ అయిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ హిట్ కొట్టలేదు మాస్ రాజా. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే కనీసం ఓపెనింగ్స్ వచ్చేవి. ఆయన సినిమా ఎలా ఉన్నా కూడా కొంతవరకు వసూలు చేసేది. కానీ గత రెండేళ్లుగా రవితేజ సినిమాలకు అసలు కలెక్షన్లు రావడం లేదు. అంటే కనీసం పది కోట్ల మార్క్ కూడా అందుకోలేక దారుణంగా పడిపోయింది రవితేజ మార్కెట్.

మొన్నొచ్చిన డిస్కో రాజా సినిమా కేవలం 7 కోట్ల 50 లక్షల మాత్రమే వసూలు చేసింది. వారం రోజుల్లోనే ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయిపోయింది. దీన్నిబట్టి రవితేజ మార్కెట్ ఎలా చనిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విజయం సాధిస్తే తప్ప రవితేజ కెరీర్ కు మంచి రోజులు రావు. ఒక రకంగా చెప్పాలంటే గోపీచంద్ సినిమా రవితేజ కు డు ఆర్ డై లాంటిది. కచ్చితంగా విజయం సాధించాల్సిందే. లేదంటే మాత్రం ఈయనను మర్చిపోవలసిందే. ఇప్పుడు ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత తమిళనాట విజయం సాధించిన సేతుపతి సినిమాకు ఇది ఫ్రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల కింద విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు కొడుకు గంట రవితేజ హీరోగా జయంత్ సి పరాన్జీ ఈ సినిమాను జయదేవ్ పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. కానీ ఈ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు దాంతో ఒక మంచి సబ్జెక్ట్  తెలుగు ప్రేక్షకులకు దూరంగా వెళ్ళిపోయింది  ఇలాంటి సమయంలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సేతుపతి ఈ సినిమాను  క్రాక్ పేరుతో రీమేక్ చేస్తున్నాడని తెలుస్తోంది. రవితేజ ఇమేజ్ కు సరిపోయేలా కథను కాస్త మార్చి తీసుకొస్తున్నాడు ఈ దర్శకుడు. సేతుపతి అదిరిపోయే యాక్షన్ మూవీ. రవితేజ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సరిపోయే సినిమా అది. దాన్ని కాస్త కాన్సంట్రేషన్ పెట్టి తీస్తే కచ్చితంగా మాస్ రాజా మళ్లీ సత్తా చూపించడం ఖాయం. ఈ సినిమాతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు రవితేజ. 

More Related Stories