English   

పవన్ కళ్యాణ్ సినిమాలో రవితేజ 

Pawan-ravi-teja
2018-03-18 08:12:15

మీరు చదివింది కరెక్టే. పవన్ కళ్యాణ్ సినిమాలో రవితేజ నటించబోతున్నాడు. ముందు గోపీచంద్ యాక్ట్ చేస్తాడనుకున్నారు కానీ.. ఫైనల్ గా రవితేజ ఓకే అయిపోయినట్టు టాక్. ఇంతకీ మేటర్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ సినిమాలు విరమించుకున్నాడు కదా.. కానీ అంతకు ముందే ఓ దర్శకుడిని ‘హైర్’ చేసుకున్నాడు. పాపం సదరు దర్శకుడు పవన్ సినిమా చేస్తాడని ఆశగా ఎదురు చూశాడు. ఫైనల్ గా పవన్ తూఛ్ అనేశాడు. అతను అలా అనేసరికి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. మరి ఆ దర్శకుడెవరో తెలుసు కదా. సంతోష్ శ్రీనివాస్. కందిరీగ హిట్ పేరు చెప్పుకుని రభస చేయాలని చూశాడు. కానీ ఫ్లాప్ అయింది. అలాగే కందిరీగ వంటి సినిమా ఇచ్చాను కదా అని రామ్ తో హైపర్ చూపించాలనుకున్నాడు. అదీ పోయింది. ఇలాంటి దర్శకులను చేరదీయడంలో పవన్ ఫస్ట్ కదా. వెంటనే తన క్యాంప్ కు రప్పించుకున్నాడు. తమిళ్ హిట్ మూవీ తెరిని రీమేక్ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో అతను రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు చెప్పాలనుకున్న కథను గోపీచంద్ కు చెప్పాడు. గోపీ కూడా ఓకే అన్నాడనుకున్నారు. కానీ ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ లోకి మాస్ రాజా వచ్చాడు.

ప్రస్తుతం రవితేజ్ నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ చేస్తున్నాడు. వీటిలో నేలటికెట్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఉగాది సందర్భంగా ఇవాళ నేల టిక్కెట్టు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సాధారణ మహిళలతో కలిసి రవితేజ్ టీ తాగుతున్నట్టుగా ఉన్న ఈ స్టిల్ ఆకట్టుకుంటోంది. టైటిల్ జస్టిఫికేషన్ కోసం స్టిల్ విడుదల చేసినట్టు కనిపిస్తోన్నా అది చాలా విషయాలు చెబుతోంది. సోఈ సినిమా పూర్తయిన తర్వాత రవితేజ సంతోష్ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ వద్దనుకున్న సబ్జెక్ట్ తో ఆమధ్య బెంగాల్ టైగర్ చేసిన రవితేజ దెబ్బయిపోయాడు. మళ్లీ ఇప్పుడలాంటి ప్రయత్నమే చేయడం ఎందుకో కానీ ఓ సారి ఆలోచించుకుంటే బెటరేమో.. 

దీంతో మరికొన్ని సినిమాలు కూడా పొలిటికల్ యాంగిల్ తీసుకుంటున్నాయి. అఫ్ కోర్స్ ఇవన్నీ డైరక్ట్ గా పాలిటిక్స్ ను టార్గెట్ చేయకపోయినా.. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పార్టీకి టచ్ అయ్యేలా ఉంటాయనేది నిజం. మరి ఈ పొలిటికల్ టచ్ కు టాలీవుడ్ ఎలా రియాక్ట్ అవుతుందో.. 

More Related Stories