English   

నేలటిక్కెట్టు సెన్సార్ కంప్లీట్

nela-ticket
2018-05-18 16:56:33

మాస్ మహారాజ్ రవితేజ నేలటిక్కెట్టు సెన్సార్ పూర్తి చేసుకుంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. రామ్ తాళ్లూరి నిర్మించిన నేల టిక్కెట్టుకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో ఆ సర్టిఫికెట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్స్ కొట్టించింది టీమ్. ఈ నెల 25న విడుదల కాబోతోన్న నేల టిక్కెట్టు బిజినెస్ ఆశించినంత గొప్పగా ఏం లేకపోయినా.. మాస్ రాజా మార్కెట్ ను బట్టి త్వరలోనే బిజినెస్ పూర్తి కావచ్చంటున్నారు. ఇక ఓవర్శీస్ లో మరీ డల్ గా ఉందీ సినిమా మార్కెట్. ఒకవేళ అనుకున్న రేట్ రాకపోతే తామే సొంతంగా విడుదల చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు నిర్మాత. 

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ను బట్టి ఇది కూడా రవితేజ మార్క్ రొటీన్ మాస్ ఎంటర్టైనర్ లా కనిపించడమే మైనస్ అయింది. అంటే ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆఁ.. ఏముందీ కొత్తగా ఇందులో అనుకున్నారనేది నిజం. మరి ట్రైలర్ ను కావాలనే ఇలా కట్ చేశారని.. సినిమాలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయనేది యూనిట్ వెర్షన్. కానీ గత కొన్నాళ్లుగా చూస్తన్న రవితేజ సినిమాలను బట్టి అది నమ్మడానికి దగ్గరగా లేదు. అయినా అటెన్షన్ డ్రా చేయాలంటే ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ను ట్రైలర్ లోనే లైట్ గా అయినా చూపించాలి కదా.. పైగా ఈ కథేంటో కూడా ముందే తెలిసిపోయినట్టుగా ఉంది. కాకపోత ఈ సమ్మర్ ఎండింగ్ ను నవ్వుల్లో ముంచెత్తాలనే ఆలోచనలో ఉన్నట్టుంది టీమ్. అందుకే తెరంగా కమెడియన్స్ కనిపించే ప్లాన్ చేసుకున్నారు. మొత్తగా సెన్సార్ పూర్తి చేసుకున్న నేలటిక్కెట్టు.. భారీ అంచనాలు లేకుండానే  ఆడియన్స్ ముందుకు ఈ నెల 25న రాబోతోంది. 

More Related Stories