English   

రవితేజకు చావో రేవో

Ravi-Teja
2018-05-21 09:42:34

మాస్ మహరాజ్ రవితేజ కొత్త సినిమా నేలటిక్కెట్టు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 25న విడుదల కాబోతోంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన నేలటిక్కెట్టు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఏముందీ ఇందులో అనుకున్నారు. ఆ స్థాయిలో ఊరమాస్ ఎంటర్టైనర్ లా కనిపించాడు రవితేజ. నిజానికి రవితేజ కు హిట్ మొహం చాటేసి చాలాకాలమైంది. లాస్ట్ ఇయర్ వచ్చిన రాజా ది గ్రేట్ మాత్రం కొంత ఊరటనిచ్చినా.. దానిపైనా విమర్శలైతే వచ్చాయి. ఈ నేపథ్యంలో తన స్టోరీ సెలెక్షన్ మారాల్సింది పోయి మళ్లీ అదే ఊరమాస్ మూవీస్ అంటున్నాడు. ఒకరకంగా చెబితే లాస్ట్ ఇయరే రవితేజ కెరీర్ క్లోజ్ అనే మాటలు వినిపించాయి. రాజా ది గ్రేట్ కొంత సస్టైన్ చేసింది. అయినా మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడా అనేలా ఈ నేలటిక్కెట్టు కనిపిస్తోంది. 

ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా ఉన్న రవితేజ మాగ్జిమం బోర్ కొట్టించడం మొదలై చాలాకాలమైంది. అయినా అవే సినిమాలు చేస్తూ వచ్చాడు. కిక్-2, బెంగాల్ టైగర్, రీసెంట్ గా టచ్ చేసి చూడు.. ఏమాత్రం కొత్తదనం లేని మాస్ ఎంటర్టైనర్స్. ఇప్పుడు వస్తోన్న నేల టిక్కెట్టు కూడా అదే తరహాలో కనిపిస్తోంది. దీంతో ఈ సారి కూడా అదే రొటీన్ అయితే ఇక రాజా కెరీర్ కు దరువు తప్పదు అంటున్నారు. అందుకే ఈ మూవీ రవితేజకు చావో రేవో అంటున్నారు.. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం రవితేజ మార్కెట్ రేంజ్  కూడా పడిపోయింది. పడిపోయిన మార్కెట్ కు కూడా త్వరగా బిజినెస్ జరగడం లేదు. నేలటిక్కెట్టు తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోనీ చేస్తున్నాడు. కానీ అతను ఊర ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇటు రవితేజ పరిస్థితి కూడా బాలేదు. అందుకే ఇప్పుడు నేల టిక్కెట్టు సక్సెస్ ఈ ఇద్దరికీ కీలకం అనేది నిజం. నేల టిక్కెట్టు ఏమాత్రం తేడా కొట్టిన అమర్ అండ్ బ్యాచ్ కు కూడా మైనస్ అవుతుంది. మరి ఇవన్నీ ఆలోచించే ఈ సినిమాకు ఒప్పుకుని ఉంటాడు రవితేజ. లేదంటే రవితేజ కెరీర్ కు ప్రాబ్లమ్స్ తప్పవు. 

More Related Stories