English   

ర‌వితేజ‌కు వాళ్లంటే అస‌హ్యం.. 

Ravi-Teja

ఎప్పుడూ న‌వ్వుతూ ఉండే ర‌వితేజ‌కు కూడా అప్పుడ‌ప్పుడూ కోపం వ‌స్తుంది. ఇప్పుడు ఆయ‌న‌కు వ‌చ్చింది కూడా. తాజాగా ఈయ‌న నేల‌టికెట్ ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా కొన్ని విష‌యాలు చెప్పాడు మాస్ రాజా. తాను ఏదైనా సినిమా చేసిన‌పుడు దాన్ని ఎక్కువ‌గా మ‌న‌సుకు తీసుకోన‌ని చెప్పాడు ర‌వితేజ‌. దానికి కార‌ణం కూడా ఉంది. అలా తీసుకుంటే సినిమా పోతే ఎక్కువ‌గా ఫీల్ అవ్వాల్సి వ‌స్తుంద‌ని.. దాని వ‌ల్ల త‌ర్వాతి సినిమాపై ఆ ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెబుతున్నాడు ర‌వితేజ‌. అందుకే ఏదైనా సినిమా దొబ్బినా కూడా తాను టేక్ ఇట్ ఈజీ పాల‌సీతో ఉంటాన‌ని త‌న‌దైన భాష‌లో చెప్పాడు మాస్ రాజా. ఇక ఇప్పుడు న‌టించిన నేల‌టికెట్ మాత్రం చాలా న‌చ్చి చేసిన క‌థ‌ని చెప్పాడు ర‌వితేజ‌. ఇందులో కొన్ని సీన్లు నిజంగానే క‌నెక్ట్ అయ్యాన‌ని.. ముఖ్యంగా బ్యాంక్ సీన్ ఒక‌టి ఉంటుంద‌ని అది చాలా బాగా న‌చ్చింద‌ని చెప్పాడు మాస్ రాజా. పేరెంట్స్ ని ప‌ట్టించుకోని పిల్ల‌లు త‌న దృష్టిలో ఉన్నా లేన‌ట్లే అని చెబుతున్నాడు ర‌వితేజ‌. అలాంటి వాళ్ల‌ను చూసిన‌పుడు త‌న‌కు అస‌హ్యం వేస్తుంద‌ని చెప్పాడు ఈ సీనియ‌ర్ హీరో. నేల‌టికెట్ లో కూడా ఇలాంటి ఓ సందేశాన్ని ద‌ర్శ‌కుడు ఇవ్వాల‌ని చూస్తున్నాడ‌ని గుర్తు చేసాడు ర‌వితేజ‌. మే 25న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో మాస్ రాజా కోరుకున్న విజ‌యం వ‌స్తుందో రాదో..? 

 

More Related Stories