English   

ర‌వితేజ నేల‌టికెట్ చంపేస్తున్నాడుగా..

ravi teja

అవును.. ఇప్పుడు ర‌వితేజ ఎవ‌రి మాట విన‌డం లేదు. ఒక్క‌సారి క‌మిట్ అయితే తానెంత దూకుడు చూపిస్తాడో ఇప్పుడు అర్థం అవుతుంది. క‌ళ్యాణ్ కృష్ణ సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ సినిమా జ‌న‌వ‌రి 5న మొద‌లైంది. అప్పుడే 70 శాతం షూటింగ్ పూర్తి చేసాడు క‌ళ్యాణ్. దీనికి నేల‌టికెట్ టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ర‌వితేజ కెరీర్ ఇప్పుడు డైల‌మాలో ఉంది. మొన్న విడుద‌లైన ట‌చ్ చేసి చూడు డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రం గురించి వీలైనంత త్వ‌ర‌గా మ‌ర్చిపోవాల‌ని ఫిక్స‌య్యాడు మాస్ రాజా. అందుకే ఈ చిత్రం విడుద‌లైన కొన్ని రోజుల్లోనే క‌ళ్యాణ్ కృష్ణ సినిమాతో బిజీ అయ్యాడు. మొన్న‌టి వ‌ర‌కు విశాఖప‌ట్నం బీచ్ లో మాస్ రాజా అండ్ టీంపై కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నారు చిత్ర‌యూనిట్. ఇక్క‌డే మ‌రో రెండు వారాలు షూటింగ్ చేయ‌బోతున్నాడు మాస్ రాజా. ఇందులో గ‌డ్డంతోనే ప‌క్కా మాస్ లుక్ లో క‌నిపిస్తున్నాడు ఈ హీరో. సోగ్గాడే, రారండోయ్ లాంటి ఫ్యామిలీ సినిమాల త‌ర్వాత క‌ళ్యాణ్ చేస్తోన్న ప‌క్కా మాస్ సినిమా ఇది. ఇందులో మాళ‌విక శ‌ర్మ‌ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. అన్నీ కుదిర్తే దివాళి విడుద‌ల ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అయిపోయిన గ‌తం గురించి ఆలోచించ‌డం కంటే జ‌ర‌గాల్సిన భ‌విష్య‌త్తుపై దృష్టి పెట్ట‌డం న‌యం అనుకుంటున్నాడు ర‌వితేజ‌. మ‌రి క‌ళ్యాణ్ అయినా మాస్ రాజాకు విజ‌యం తీసుకొస్తాడో లేదో..?

More Related Stories